ETV Bharat / bharat

స్టూడెంట్​తో బలవంతంగా మద్యం తాగించిన టీచర్.. ఒక్కసారిగా! - tution teacher wine

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. ఓ విద్యార్థినితో బలవంతంగా మద్యం తాగించాడు. ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల భయపడి తన ఇంటి వద్ద దించేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్​లోని వడోదరలో జరిగిందీ ఘటన.

Gujarat: Vadodara teacher arrested, case registered after he forces student to drink with him

author img

By

Published : Aug 5, 2022, 10:57 PM IST

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే ఘటన గుజరాత్​లోని వడోదరలో జరిగింది. తన దగ్గర విద్యను నేర్చుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థిని(15) పట్ల ఓ ట్యూషన్​ టీచర్​ అనుచితంగా ప్రవర్తించాడు. ట్యూషన్​ అయిపోయాక ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. వెంటనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించింది. దీంతో భయపడి ఆమెను తన ఇంటి వద్ద కారులో దించేశాడు​.

Gujarat: Vadodara teacher arrested, case registered after he forces student to drink with him
ట్యూషన్​ టీచర్​

ఇంటికి వచ్చిన కుమార్తె పరిస్థితిని చూసి ఆమె తల్లి షాకైంది. ఏం జరిగిందో అడిగింది. వెంటనే జరిగిన విషయాన్ని బాధితురాలు.. తల్లికి చెప్పింది. అనంతరం విద్యార్థిని కుటుంబసభ్యులు.. ఫతేగంజ్​ పోలీసుస్టేషన్​లో ట్యూషన్​ టీచర్​పై ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్యూషన్​ టీచర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇవీ చదవండి: ఈ నెల 18 వరకు జైల్లోనే పార్థా చటర్జీ, అర్పిత.. మోదీని కలిసిన మమత

హెచ్​ఐవీ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకున్న యువతి.. ఎందుకో తెలిస్తే షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.