ETV Bharat / bharat

89 స్థానాలు.. 788 మంది అభ్యర్థులు.. గుజరాత్​ తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధం - గుజరాత్ ఎన్నికలు 2022

Gujarat Elections 2022 : హోరాహోరీగా సాగిన గుజరాత్​ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై​.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

gujarat assembly election 2022
gujarat assembly election 2022
author img

By

Published : Nov 30, 2022, 6:37 PM IST

Updated : Dec 1, 2022, 2:07 PM IST

Gujarat Elections 2022 : గుజరాత్‌ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్షాలు చేసిన.. విస్తృత ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గురువారం దక్షిణ గుజరాత్‌లోని.. 19 జిల్లాలు, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని.. పరీక్షించుకుంటున్నారు.

Gujarat Elections 2022
మొదటి దశ ఎన్నికల ముఖచిత్రం

మొదటి దశ ఎన్నికల్లో 25,434 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 9,018, గ్రామీణ ప్రాంతాల్లో 16,416 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 2,20,288 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సీఈసీ వెల్లడించింది.

Gujarat Elections 2022
పార్టీల వారీగా నేరచరిత్ర గల అభ్యర్థులు
గిరిజనులు, పాటీదార్లే కీలకంమొదటి దశ ఎన్నికల్లో పటేల్​, గిరిజన వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. దక్షిణ గుజరాత్​లో ఉన్న 35 సీట్లలో 14 గిరిజన స్థానాలే. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. సూరత్​ రూరల్​, బర్డోలీ, మండ్వీ, మహువా, అల్పడ్​, కమ్రేజ్​, మంగ్రోల్ స్థానాల్లో పటేల్​ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది.
Gujarat Elections 2022
అభ్యర్థుల విద్యార్హతలు
Gujarat Elections 2022
బరిలో ఉన్న మహిళా అభ్యర్థులు
Gujarat Elections 2022
అభ్యర్థుల వయసు
Gujarat Elections 2022
బరిలో ఉన్న కోటీశ్వరులు
Gujarat Elections 2022
పోటీలో ఉన్న ప్రముఖులు
Gujarat Elections 2022
పార్టీల వారీగా నేరచరిత్ర

ఇవీ చదవండి: ఆప్‌ రాకతో భాజపాలో కలవరం.. గుజరాత్​లో 'కచ్‌' కుచ్‌ హోతాహై!

ముగిసిన ప్రచార పర్వం.. గుజరాత్​లో తొలివిడత ఎన్నికలకు సర్వం సిద్ధం

Last Updated : Dec 1, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.