ETV Bharat / bharat

మొబైల్​లో పోర్న్ చూసి.. 10 రోజుల్లో ముగ్గురు బాలికలపై.. - గుజరాత్ అత్యాచార వార్తలు

మొబైల్​లో పోర్న్​ చూడటానికి అలవాటు పడిన ఓ కామాంధుడు.. 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టి, ఒకరిని హత్య చేశాడు. మాయమాటలు చెప్పి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్​ చేసి మరీ తన వాంఛ తీర్చుకున్నాడు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

Man rapes three minor girls
10 రోజుల్లో ముగ్గురి బాలికలపై
author img

By

Published : Nov 8, 2021, 6:10 PM IST

10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడి, ఒకరిని హత్య చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మూడేళ్ల బాలికను అత్యాచారం చేస్తుండగా.. కేకలు వేస్తోందన్న కారణంగా చంపేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

ఏమైందంటే..?

గుజరాత్​, గాంధీనగర్ జిల్లా కలోల్ మండలం వన్సజదా గ్రామానికి చెందిన విజయ్ ఠాకూర్(26).. ఓ రోజు కూలీ. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మొబైల్ ఫోన్​లో అతిగా పోర్న్​ చిత్రాలు చూసేందుకు అలవాటుపడ్డ విజయ్​.. నవంబరు 4న రంచర్దా గ్రామంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్​ చేశాడు. తర్వాత బాలికపై అత్యాచారం చేసి.. అదే రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారిని వదిలి వెళ్లాడు. బాలికకు వైద్యపరీక్షలు చేయగా.. అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఇదే ఘటనపై బాధితురాలి తల్లి సంతెజ్​ స్టేషన్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేకలు వేస్తుందని..

మరుసటి రోజు నవంబరు 5 రాత్రి.. మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్​ చేశాడు విజయ్​. చిన్నారి పెద్దగా కేకలు పెట్టటం వల్ల చంపేశాడు. ఆ తర్వాత రేప్ చేసి.. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న కల్వర్టులో పడేశాడు. ఈ ఘటనపైనా సంతెజ్​ స్టేషన్​కు ఫిర్యాదు అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాలు, స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయ్​ను అరెస్ట్ చేశారు.

డ్రెస్ కొనిస్తానని..

బాలికలపై తానే అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో విజయ్ అంగీకరించినట్లు గాంధీనగర్​ ఐజీపీ అభయ్​ చుదసమా తెలిపారు. గట్టిగా అరుస్తున్నందువల్లే మూడేళ్ల చిన్నారిని చంపినట్లు ఒప్పుకున్నాడని వివరించారు. 10రోజుల క్రితం.. ఏడేళ్ల బాలికపైనా విజయ్ అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. బాలికకు కొత్త బట్టలు కొనిస్తానని మాయమాటలు చెప్పి వాంఛ తీర్చుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

విజయ్​ అఘాయిత్యాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు గాంధీనగర్​ ఐజీపీ అభయ్​ చుదసమా తెలిపారు.

ఇదీ జరిగింది: పసికందుపై అత్యాచారం.. ఆపై కిరాతకంగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.