ETV Bharat / bharat

పెగసస్​పై కేంద్రం, రాహుల్ మధ్య మాటల యుద్ధం! - పెగాసస్​

పెగసస్​పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మధ్య మాటల యుద్ధం తలెత్తింది. దీనిపై పార్లమెంట్​లో చర్చ జరపాలని రాహుల్ డిమాండ్ చేయగా.. కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. పెగసెస్​ అంశాన్ని అనవసరంగా సమస్యగా మారుస్తున్నారని మండిపడ్డారు.

pegasus issue
రాహుల్​ గాంధీ పెగాసస్
author img

By

Published : Jul 29, 2021, 2:59 PM IST

పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభ సజావుగా జరగకపోవడానికి సర్కారే కారణమని రాహుల్ వ్యాఖ్యానించగా.. కేంద్ర మంత్రి వాటిని ఖండించారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై పార్లమెంట్​లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సమయం వృథా చేయకుండా.. పెగసస్​పై చర్చించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చించుకోవాలని అన్నారు.

"పార్లమెంట్ సభ్యులుగా.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలి. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చించాలి. ఇదే మన ప్రజాస్వామ్యానికి పునాది. విపక్షాలు ఈ పని చేయడానికి అనుమతించడం లేదు. పార్లమెంట్ సమయాన్ని వృథా చేయొద్దు. పెగసస్, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చిద్దాం."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అయితే, రాహుల్ తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుబట్టారు. అసలు ప్రాముఖ్యం లేని అంశాన్ని సమస్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. సభ సజావుగా నడవటం కేంద్రానికి ఇష్టం లేదని చెప్పడం తగదని పేర్కొన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మందిపై నిఘా వేయడమా? రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. అదే అసలు సమస్య. ఆయన అపరిపక్వతతో మాట్లాడతారు. సభ సక్రమంగా నడిచేందుకు సహకరించాలని.. ప్రభుత్వం, స్పీకర్, ఛైర్మన్ కోరుతూనే ఉన్నారు. వ్యక్తిగతంగానూ వారిని అభ్యర్థించాం. అయినా, వారు సభను కొనసాగనివ్వడం లేదు."

-ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

రాజ్యసభలో కరోనా అంశంపై ప్రభుత్వం చర్చ జరిపిందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. లోక్​సభలో మాత్రం వారు ఈ చర్చ జరిగేలా సహకరించలేదని ఆరోపించారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: పెగసస్​పై ఆగని రగడ- దద్దరిల్లిన పార్లమెంట్​

విపక్ష కూటమికి నాయకత్వంపై దీదీ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.