ETV Bharat / bharat

'స్మగ్లింగ్​కు సీఎం అండ.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. గవర్నర్​ సవాల్ - కేరళ సీఎం గవర్నర్​ వివాదం

విశ్వవిద్యాలయాల వీసీ నియామకాల్లో గవర్నర్​ జోక్యం చేసుకుంటున్నారన్న కేరళ సీఎం చేసిన వాఖ్యలను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఖండించారు. వాటిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే మీరు రాజీనామా చేస్తారా అంటూ ముఖ్యమంత్రికి సవాల్​ విసిరారు.

kerala
కేరళ
author img

By

Published : Nov 3, 2022, 3:04 PM IST

Updated : Nov 3, 2022, 4:04 PM IST

కేరళ విశ్వవిద్యాలయాల వీసీ నియామకాల్లో గవర్నర్​ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారన్న సీఎం పినరయి విజయన్‌ చేసిన ఆరోపణలను గురువారం ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తోసిపుచ్చారు. అందుకు ఒక్క ఉదాహరణ చూపించిన తాను రాజీనామా చేస్తానన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయగలరా అని బహిరంగంగా సవాలు విసిరారు.

"ముఖ్యమంత్రి కార్యాలయమే రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోంది. దీంట్లో సీఎం జోక్యం ఉందనడానికి రుజువులు ఉన్నాయి. ఇదంతా నేను చూస్తునే ఉన్నాను. దీనిపై పుస్తకాలు సైతం వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు కన్నూర్ విశ్వవిద్యాలయంలో తమ బంధువులను ఎటువంటి అర్హత లేకున్నా నియమించుకోవాలని వీసీని ఆదేశించారు." అని గవర్నర్​ అన్నారు.

తాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులను తీసుకురావడానికే వీసీలపై చర్యలకు పాల్పడుతున్నట్లు వామపక్ష ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​ అన్నారు. "నా అధికారాన్ని ఉపయోగించి ఆర్‌ఎస్‌ఎస్‌కే కాదు, ఏ వ్యక్తినైనా, నామినేట్ చేసి ఉంటే దాన్ని నిరూపించండి రాజీనామా చేస్తాను. లేదంటే మీరైనా రాజీనామా చేయండి" అంటూ ముఖ్యమంత్రికి సవాల్​ విసిరారు.

బుధవారం తిరువనంతపురంలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లడుతూ గవర్నర్‌ యూనివర్సిటీలను ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ కేంద్రాలుగా మార్చి కాషాయీకరణ ఎజెండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Last Updated : Nov 3, 2022, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.