ETV Bharat / bharat

ఓటీటీలపై ఇక కేంద్రం పర్యవేక్షణ - Ministry of Information and Broadcasting

డిజిటల్​ ప్లాట్​ఫామ్స్​ ఇక సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

Government issues order bringing online platforms OTTs under the Ministry of Information and Broadcasting
ఇక ఓటీటీల్లో బూతులు బంద్​!
author img

By

Published : Nov 11, 2020, 11:51 AM IST

Updated : Nov 11, 2020, 12:40 PM IST

అమెజాన్, నెట్​ఫ్లిక్స్​ వంటి ఓటీటీలు, ఇతర డిజిటల్ వేదికలు... సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆన్‌లైన్​ చలనచిత్రాలు, ఆడియో-విజువల్​ ప్రోగ్రామ్స్​, ఆన్‌లైన్​ వార్తలు, వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన ప్లాట్​ఫామ్స్​ అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.

ఓటీటీలను సమాచార ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొస్తూ కేబినెట్​ రూపొందించిన దస్త్రంపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సంతకం చేశారు. రాజ్యాంగంలోని ప్రకరణ 77లోని క్లాజ్ (3)ను భారత ప్రభుత్వ (బిజినెస్ కేటాయింపు) నిబంధనలు-1961 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్రం. దీంతో ఆన్‌లైన్​ వేదికల్లో వచ్చే వార్తలు, ఆడియో, విజువల్స్​, చిత్రాలకు సంబంధించిన విధానాలను నియంత్రించే అధికారం మంత్రిత్వ శాఖకు ఉంటుందని తెలిపింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొంది.

ఇదీ చూడండి: మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు: ఈసీ

Last Updated : Nov 11, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.