ETV Bharat / bharat

విమానం సీటు కింద దాచి బంగారం స్మగ్లింగ్​.. చివరకు... - కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

విమానం సీటు కింద బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా తరలించాలని(Gold Smuggling) యత్నించాడు ఓ వ్యక్తి. అయితే.. కస్టమ్స్​ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలు ఉంటుందని చెప్పారు.

gold smuggling news
బంగారం స్మగ్లింగ్​
author img

By

Published : Sep 30, 2021, 3:23 PM IST

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు(Gold Smuggling) కొంతమంది నానా ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే.. అధికారుల కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. విమానంలోని సీటు కింద బంగారాన్ని(Gold Smuggling) దాచి, అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే.. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలుగా ఉంటుందని చెప్పారు.

ఎలా తెలిసింది?

దుబాయ్​ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం.. గురువారం చేరుకుంది. ప్రయాణికులంతా దిగాక.. విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఈ బంగారం బయటపడింది. ఎకానమీ క్లాస్​లోని ఓ సీటుకు ప్యాకెట్​​ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అందులో చూస్తే.. పేస్ట్​ రూపంలో, 29 స్టిక్స్​ రూపంలో 701 గ్రాముల బంగారం బయటపడింది.

Gold Smuggling
స్టిక్స్​రూపంలో బంగారం
Gold Smuggling
పేస్ట్ రూపంలో దాచిన బంగారం

దీనిపై కస్టమ్స్​ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు(Gold Smuggling) యత్నించిన నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: వానరాలకు విషం పెట్టి హత్య.. ఆపై రోడ్డు పక్కన విసిరేసి..

ఇదీ చూడండి: మాస్క్​ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.