ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్​ కారణంగా గర్భం.. యూట్యూబ్ చూసి అబార్షన్​.. కానీ... - యూట్యూబ్ అబార్షన్ వీడియోలు

Girl YouTube abortion: గర్భం తొలగించుకునేందుకు ఓ బాలిక దుస్సాహసం చేసింది. యూట్యూబ్ వీడియోలు చూసి.. అబార్షన్ కోసం యత్నించింది. చివరకు తీవ్ర అనారోగ్యం పాలైంది.

girl abortion watching youtube
girl abortion watching youtube
author img

By

Published : Apr 4, 2022, 12:02 PM IST

abortion YouTube video: గర్భాన్ని కుటుంబ సభ్యుల నుంచి దాచేందుకు తనపై తానే ప్రయోగాలు చేసుకుని, ప్రాణాలు మీదకు తెచ్చుకుంది ఓ యువతి. యూట్యూబ్​లో చూసి గర్భం తొలగించుకోవాలని భావించింది. చివరకు ఆమెకు అబార్షన్ అయింది. మహారాష్ట్ర నాగ్​పుర్​లోని నార్ఖేడ్ తాలుకాలో ఈ ఘటన జరిగింది. నార్ఖేడ్​కు చెందిన 17 ఏళ్ల బాలిక ఆరు నెలల క్రితం తన బాయ్​ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. శారీరక కలయిక ద్వారా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన బాయ్​ఫ్రెండ్​కు చెప్పింది. ఆ యువకుడు కొన్ని మందులు తీసుకుంటే.. అబార్షన్ అవుతుందని చెప్పాడు. అవి బయట దొరకలేదు.

girl abortion watching YouTube: దీంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిపోతుందని భయపడిన బాలిక.. యూట్యూబ్​లో అన్వేషణ ప్రారంభించింది. ఓ ఔషధం తీసుకుంటే అబార్షన్ అవుతుందని ఓ వీడియోలో చెప్పేసరికి దాన్ని పాటించింది బాలిక. కానీ, ఈ వ్యూహం బెడిసికొట్టింది. బాలిక ఆరోగ్యం పాడైంది. అనుమానం వచ్చి ఆరా తీసిన తల్లికి.. విషయం చెప్పేసింది బాలిక. దీంతో వెంటనే కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లింది.

girl abortion watching youtube
ఎంఐడీసీ పోలీస్ స్టేషన్, నాగ్​పుర్

Abortion tips YouTube: బాలిక ప్రస్తుతం నాగ్​పుర్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. ప్రాణాలకు అపాయమేమీ లేదని తేల్చారు. మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్(ఎంఐడీసీ) పరిధిలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో.. ఎంఐడీసీ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. బాలిక బాయ్​ఫ్రెండ్​ వివరాలను సేకరించారు. ఆ వ్యక్తికి 27 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: CCTV Video: గన్స్​తో బెదిరించి నడిరోడ్డుపైనే లూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.