"నేనొక గ్యాంగ్‌స్టర్‌ని. నన్ను ఎన్కౌంటర్ చేయకండి. అరెస్ట్ చేయండి సార్" అంటూ ప్లకార్డ్ పట్టుకుని.. పోలీసుల ముందుకొచ్చాడు ఓ వ్యక్తి. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. ప్లకార్డ్ పట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో ఇలా వారి ముందుకు వచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జాబుల్ అనే గ్యాంగ్‌స్టర్.. పోలీసులు ముందు ఈ తరహాలో లొంగిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న జాబుల్.. జిల్లాలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. జాబుల్ హైబత్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతడు గోవు హత్యలతో పాటు.. చాలా నేరాల్లో పాల్గొన్నాడు. దీంతో జాబుల్ను.. గ్యాంగ్‌స్టర్‌గా గుర్తిస్తూ కేసు నమోదు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు. నిందితుడు చాలా కాలంగా పోలీసులు నుంచి తప్పించుకుని తిరుగున్నాడు.
ఈ మధ్యకాలంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. చాలా మంది గ్యాంగ్స్టర్లు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇలానే తనను కూడా చంపేస్తారనే భయంతో జాబుల్ పోలీసులలకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందుతుడిని అదుపులోకి తీసుకన్న అనంతరం కోర్టులో హాజరు పరిచినట్లు.. అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీష్ చంద్ర తెలిపారు. తరువాత అతడిని జైలుకు తరలించినట్లు ఆయన వెల్లడించారు.
![ోgangster surrender in up gangster surrender before police with pamphlet fearing of encounter in uttarpradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/badmashkasurrender_25042023150114_2504f_1682415074_688.jpg)
![gangster surrender in up gangster surrender before police with pamphlet fearing of encounter in uttarpradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/badmashkasurrender_25042023150114_2504f_1682415074_419.jpg)
![gangster surrender in up gangster surrender before police with pamphlet fearing of encounter in uttarpradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/badmashkasurrender_25042023150114_2504f_1682415074_769.jpg)
ఎన్కౌంటర్ చేయకండి సార్ లొంగిపోతా.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్‌కు పరుగులు..
కొంతకాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. నేరాలకు పాల్పడితే ఎన్కౌంటర్ చేస్తామంటూ.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన హెచ్చరికలతో భయపడ్డ ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి.. మెడలో ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని.. తనను ఎన్కౌంటర్ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. గాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
లోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 సెప్టెంబర్ 9న ఓ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరమైతే నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దీంతో హడలిపోయిన నిందితుడు సొహైల్.. తాను జీవితంలో మరోసారి నేరం చేయనని.. తనను ఎన్కౌంటర్ చేయవద్దని మెడలో బోర్డు తగిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి