రోగి పిత్తాశయంలో నుంచి 630 రాళ్లను తొలగించి.. వైద్యరంగంలో మైలురాయిని అందుకున్నారు అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్లు. గాల్ బ్లాడర్‌లో సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఓ ఆసుపత్రి వైద్యుల బృందం.. శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా రాళ్లను తొలగించింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.
గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా గాల్ బ్లాడర్, సికిల్ సెస్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి.. మూత్ర విసర్జన సమయంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అతడి పరిస్థితి తెలుసుకొని.. నిపుణులతో కూడిన వైద్య బృందం అధునాతన సాంకేతికతతో.. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంగియో పాంక్రియాటోగ్రఫీ (ERCP) ద్వారా శస్త్ర చికిత్స చేసింది. గాల్ బ్లాడర్‌లో ఉన్న 630 రాళ్లను తొలగించింది. పిత్తాశయంలో రాళ్లను తొలగించడానికి శస్త్ర చికిత్సలో లాపరోస్కోపిక్ కోలెసెక్టోమిని వైద్యులు ఉపయోగించారు.
రోగికి అవసరమైన వైద్య పరీక్షలన్నీ సూరత్‌లో జరిగాయి. ఈ పరీక్షలకు అయిన ఖర్చంతా కాకా బా ఆసుపత్రి భరించింది. కాగా అతడికి ఆపరేషన్.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జరిగింది. దీంతో రోగికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండానే.. అవసరమైన చికిత్స అందిందని వైద్యులు తెలిపారు.
"కాకా బా ఆస్పత్రిలో అంకితభావంతో కూడిన నిపుణుల బృందం.. శస్త్రచికిత్స చేయడంలో విజయం సాధించింది. ఈ విజయం మరింత మందికి.. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడానికి దోహదం చేస్తుంది" అని కాకా బా ఆసుపత్రి వైద్యుడు, కలబుద్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు డా. భరత్ చంపానెరియా తెలిపారు.
వైద్యరంగంలో మరో ఘనత..
ఇటీవల 13 నెలల చిన్నారి రెండు కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చారు బెంగళూరులోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు. ఆ ఆస్పత్రిలోని యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ నేతృత్వంలోని వైద్యుల బృందం.. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..