ETV Bharat / bharat

పోలీస్ హత్యకు రెండు రోజుల్లోనే రివెంజ్- నలుగురు ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్

ఉగ్రవాదంపై పోరులో భద్రతా సిబ్బంది కీలక పురోగతి సాధించారు. జమ్ముకశ్మీర్​లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ముష్కరుల్ని మట్టుబెట్టారు.

jammu kashmir encounter today
పోలీస్ హత్యకు రెండు రోజుల్లోనే రివెంజ్- నలుగురు ఉగ్రవాదులు హతం
author img

By

Published : Oct 5, 2022, 8:56 AM IST

జమ్ముకశ్మీర్​లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకడ్ని.. దక్షిణ కశ్మీర్​ షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహ్మద్ ముష్కర మూకకు చెందిన మరో ముగ్గుర్ని డ్రాచ్ ప్రాంతంలో హతమార్చారు.

పోలీసు హత్యకు ప్రతీకారం..
షోపియాన్​లోని డ్రాచ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు మరణించారు. వీరిలో ఇద్దరిని హనన్​ బిన్ యాకూబ్, జంషెద్​గా గుర్తించారు. పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో అక్టోబర్​ 2న జమ్ముకశ్మీర్​ పోలీసు జావెద్ దర్​ను, సెప్టెంబర్​ 24న పుల్వామాలో బంగాల్​ నుంచి వలస వచ్చిన కూలీని కాల్చి చంపిన కేసుల్లో యాకూబ్, జంషెద్ నిందితులని పోలీసులు తెలిపారు.

మరోవైపు.. మోలూలో ఉగ్రవాదులు ఉన్నారనే కచ్చితమైన సమాచారంతో బుధవారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలకు చెందిన సిబ్బంది కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ చోట దాక్కుని ఉన్న ఉగ్రవాది కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ప్రతిఘటించారు. ఎదురుకాల్పుల్లో ఒక ముష్కరుడు హతమయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.