ETV Bharat / bharat

టీఎంసీ గూటికి కేంద్ర మాజీ మంత్రి బాబుల్​ సుప్రియో - టీఎంసీ

తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు.. కేంద్ర మాజీ మంత్రి బాబుల్​ సుప్రియో(babul supriyo news). అభిషేక్​ బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకొన్నారు.

Babul Supriyo formally joins TMC
బాబుల్​ సుప్రియో
author img

By

Published : Sep 18, 2021, 3:07 PM IST

Updated : Sep 18, 2021, 8:11 PM IST

కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ ఎంపీ బాబుల్​ సుప్రియో.. తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు(babul supriyo news). టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ, పార్టీ ఎంపీ డెరెక్​ ఒబ్రెయిన్​ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.

Babul Supriyo formally joins TMC
బాబుల్​ సుప్రీయో- అభిషేక్​ బెనర్జీ

గత నెలలో రాజకీయాలకు గుడ్​బై చెబుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు బాబుల్​. కేంద్ర కేబినెట్​ విస్తరణ అనంతరం పదవి కోల్పోవడం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే.. రాజకీయాలకు గుడ్​బై చెప్పడం లేదని.. భాజపాకు రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య శనివారం ఆయన టీఎంసీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

"రాజకీయాలు వదిలేస్తానని మనస్ఫూర్తిగా చెప్పాను. కానీ టీఎంసీలో చేరే అవకాశం లభించడం సంతోషాన్నిచ్చింది. రాజకీయాలను వదిలేయడం మంచి నిర్ణయం కాదని నా స్నేహితులు నాకు చెప్పారు. మనసు మార్చుకోవడంపై గర్వపడుతున్నా. బంగాల్​కు సేవ చేసేందుకు నేను తిరిగొస్తున్నాను. మమతా బెనర్జీనిని సోమవారం కలుస్తా. నాకు దక్కిన స్వాగతాన్ని చూసి సంతోషిస్తున్నా."

--- బాబుల్​ సుప్రియో, ఎంపీ.

'ఇది ఆరంభం మాత్రమే..'

అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీలోకి వలసలు పెరిగిపోయాయి. భాజపా నుంచి అనేక మంది టీఎంసీలోకి చేరుతున్నారు. వీరిలో గతంలో పార్టీని వీడి కమలం గూటికి చేరిన వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. టీఎంసీతో ఇంకా చాలా మంది భాజపా నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని పార్టీ నేత కునాల్​ ఘోష్​ వ్యాఖ్యానించారు. భాజపాతో ఎవరికి సంతృప్తి లేదని.. ఈరోజు బాబుల్​ సుప్రియో వచ్చినట్టు.. రేపు ఇంకొందరు వస్తారని.. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Babul Supriyo formally joins TMC
టీఎంసీలోకి బాబుల్​

ఇవీ చూడండి:- మోదీ X దీదీ: దిల్లీ పీఠం కోసం 'ఆపరేషన్​ ముకుల్'!

Last Updated : Sep 18, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.