ETV Bharat / bharat

భాజపాలోకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్​?

పంజాబ్ శాసనసభ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(amarinder singh news)​ కాంగ్రెస్​కు షాక్​ ఇవ్వడం ఖాయమా? తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు(amarinder singh bjp).

amarinder singh bjp
అమరీందర్​ సింగ్​
author img

By

Published : Sep 28, 2021, 1:19 PM IST

Updated : Sep 28, 2021, 2:47 PM IST

పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​(amarinder singh news)​ దిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్​ షాతో మంగళవారం సాయంత్రం ఆయన భేటీ అవుతారన్న(amarinder singh bjp) ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన సమయంలోనే కాంగ్రెస్​పై అమరీందర్​ బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం.. తాజా పరిస్థితులకు మరింత బలం చేకూరుస్తోంది.

మరికొన్ని నెలల్లో పంజాబ్​కు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి(punjab election 2022). అంతలోనే ఈ నెల 18న ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ తన పదవికి రాజీనామా చేశారు. తనను కాంగ్రెస్​ అవమానించిందని ఆరోపించారు. సీఎంగా రాజీనామా చేస్తానని అనేక నెలల ముందే సోనియాకు చెప్పినా.. అప్పుడు వద్దని, ఇప్పుడు తప్పించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అమరీందర్​ సింగ్​ రాజీనామా అనంతరం పంజాబ్​ కాంగ్రెస్​ దళిత అస్త్రాన్ని ప్రయోగించింది. దళిత నేత చరణ్​జిత్​ సింగ్​ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది. అమరీందర్​ ప్రత్యర్థి.. పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూకు చన్నీ అత్యంత సన్నిహితుడు.

ఇదీ చూడండి:- ఓటు కోసం 'దళిత' వ్యూహం- దేశంలో​ నయా రాజకీయం!

'ఎక్కువ ఆలోచిస్తున్నారు..'

అమరీందర్​ దిల్లీ పర్యటనపై ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఆయన మీడియా సలహాదారు రవీన్​ తుక్రల్​ అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన దిల్లీ వెళతున్నారని, కొందరు 'మిత్రుల'ను ఆయన కలుస్తారని వెల్లడించారు.

కాగా.. భాజపాలో చేరడంపై అమరీందర్​ను మీడియా ఇటీవలే ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ఆయన కొట్టిపారేయకపోగా.. 'నా మద్దతుదారులతో చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటా,' అని వెల్లడించారు.

అమరీందర్​ పార్టీ మారితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ సీఎం పార్టీని వీడుతున్నారంటే అధికార పక్షానికి కొంత ఇబ్బంది కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు(punjab congress crisis).

ఇదీ చూడండి:-

Last Updated : Sep 28, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.