ETV Bharat / bharat

మాజీ హోంమంత్రికి రిలీఫ్.. అవినీతి కేసులో ఏడాది తర్వాత జైలు నుంచి విడుదల

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఏడాదికి పైగా జైల్లో ఉన్న ఆయన.. తాజాగా విడుదలయ్యారు.

Anil Deshmukh released
Anil Deshmukh released
author img

By

Published : Dec 28, 2022, 6:07 PM IST

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్​ముఖ్ జైలు నుంచి బయటకు వచ్చారు. అవినీతి కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్​పై స్టే పొడగించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో దేశ్​ముఖ్.. జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ సహా పలువురు నాయకులు ఆయనకు జైలు బయట ఆహ్వానం పలికారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని దేశ్​ముఖ్ పేర్కొన్నారు. 'న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ఎవరో చెబితే విని.. నాపై చేసిన ఆరోపణలు చేసినట్లు పరంబీర్ సింగ్ తన అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవు' అని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనిల్ దేశ్​ముఖ్ వ్యాఖ్యానించారు.

anil-deshmukh-released
మీడియాతో మాట్లాడుతున్న అనిల్ దేశ్​ముఖ్

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో 2021 నవంబర్ నుంచి అనిల్ దేశ్​ముఖ్(73) జైల్లోనే ఉన్నారు. ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఈ ఆరోపణలు చేయగా.. దీనిపై తొలుత సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా, సీబీఐ కేసులో బెయిల్​పై బయటకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.