ఝార్ఖండ్ రామ్‌గఢ్ (Jharkhand's Ramgarh) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు బస్సు ఢీకొట్టడం వల్ల ఐదుగురు దుర్మరణం చెందారు.
![Jharkhand's ramgarh accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/aag_15092021093533_1509f_1631678733_352.jpg)
ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు తలెత్తాయి. అనంతరం బస్సుకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యారు.
![Jharkhand's ramgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/breaking_15092021092218_1509f_1631677938_566.jpg)
రాజ్రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్బంద వద్ద 23వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ టీనేజీ అబ్బాయి ఉన్నారని తెలిపారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
బాధితులు పట్నాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఫ్లైఓవర్‌పై కారు, బైకు ఢీ.. 30 అడుగుల ఎత్తు నుంచి పడి ఇద్దరు...