ETV Bharat / bharat

సినిమా ఛాన్స్ పేరుతో బాలికపై ఫిల్మ్​ మేకర్ లైంగిక దాడి! - లైంగిక వేధింపులు ముంబయి

Film maker sexual assault: సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఆశ చూపి.. ఓ బాలికను లైంగికంగా వేధించాడు ఓ ఫిల్మ్ మేకర్. నిందితుడిని ముంబయి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరోవైపు, ఒడిశాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

Sexual assault case
Sexual assault case
author img

By

Published : Jan 15, 2022, 3:30 PM IST

Film maker molesting a girl: సినీ ఇండస్ట్రీలో పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తానని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. సినిమా ఛాన్స్ ఆశ చూపించి.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ కేసును విచారిస్తున్న ముంబయి పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354ఏ, పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు జరుపుతున్నారు.

బాలికపై అత్యాచారం..

Odisha Girl raped: మరోవైపు, ఒడిశా భువనేశ్వర్ శివారులో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కూలీ పని చేసుకునే బాలిక దగ్గరి బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను రేప్​ చేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

బాధితురాలిని తొలుత బాలిపట్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్​లోని క్యాపిటల్ ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

మహిళపై సహోద్యోగి...

మరోవైపు, త్రివేండ్రం విమానాశ్రయంలో పనిచేసే ఉన్నతాధికారి.. తోటి మహిళా ఉద్యోగిని తన ఫ్లాట్​లో లైంగికంగా వేధించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

kerala airport official sexual assault

నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన తనను.. మధుసూదన రావు అనే వ్యక్తి జనవరి 4న తన ఫ్లాట్​కు ఆహ్వానించాడని బాధితురాలు పేర్కొన్నారు. అక్కడే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ డైరెక్టర్​గా పదవీ విరమణ చేసిన ఆయన సైతం నెల క్రితమే.. త్రివేండ్రం విమానాశ్రయం ఆపరేటింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.

ఆరోపణల నేపథ్యంలో మధుసూదన రావును విధులలో నుంచి తొలగించినట్లు ఎయిర్​పోర్ట్ అధికారులు తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత మహిళ స్టేట్​మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: యాక్టర్ సచిన్ జోషికి షాక్- ఆ​ కేసులో రూ. 410 కోట్ల ఆస్తుల జప్తు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.