Fetus in Infant Bihar: బిహార్లోని మోతిహారీ జిల్లాలో అరుదైన వైద్య సమస్య వెలుగులోకి వచ్చింది. 40 రోజుల పసిగుడ్డు శరీరంలో పిండం పెరిగింది.
![FETUS IN 40 DAYS INFANT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15417671_ft6bltnacaagkhb2022052908230720220529085406-1.jpg)
![FETUS IN 40 DAYS INFANT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15417671_ft6bltnacaagkhb2022052908230720220529085406-2.jpg)
స్కానింగ్ రిపోర్ట్ చూసి వైద్యుడు తబ్రీజ్ అజీజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారి శరీరంలో ఓ పిండం ఉందని, అది పెరుగుతూ వస్తోందని గుర్తించారు. "వైద్య పరిభాషలో దీన్ని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారు. శిశువు కడుపులో ఇంకో పిండం ఉండటం దీనర్థం. ఐదు లక్షల మందిలో ఒకరికే ఇలాంటి అరుదైన సమస్య వస్తుంది" అని వైద్యుడు వివరించారు.
FETUS IN 40 DAYS INFANT: విషయం తల్లిదండ్రులకు వివరించి సర్జరీకి ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ అజీజ్ తెలిపారు. విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తయిందని చెప్పారు. చిన్నారి బాగానే కోలుకుందని వెల్లడించారు. పరిస్థితి కుదుటపడగానే శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: