ETV Bharat / bharat

మరో పరువు హత్య.. లవర్​తో పరారైనందుకు కూతురు మర్డర్​.. కరెంట్​ షాక్​ అని చెప్పి.. - బంగాల్​లో భార్యను చంపిన భర్త

కుమార్తె ప్రేమించిన వ్యక్తితో ఇంటిలో నుంచి వెళ్లిపోయిందని కోపం పెంచుకున్నాడు ఓ తండ్రి. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు. అనంతరం శ్మశానంలో పాతిపెట్టాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, తాత మరణాన్ని జీర్ణించుకోలేక ఓ బాలుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Father killed daughter
Father killed daughter
author img

By

Published : Mar 26, 2023, 8:16 AM IST

Updated : Mar 26, 2023, 11:22 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో పరువు హత్య కలకలం రేపింది. కన్న తండ్రే కాలయముడై కుమార్తెను చంపేశాడు. అనంతరం శ్మశానంలో పాతిపెట్టాడు. కరెంట్​ షాక్​ వల్ల తన కుమార్తె చనిపోయిందని అందరినీ నమ్మించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్​రాజ్​ జిల్లాలోని కర్చన పోలీస్​ స్టేషన్ పరిధిలోని హిందూ బేలా అనే గ్రామంలో లల్లన్​ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లల్లన్​ పెద్ద కుమార్తె చాందిని.. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెతికి ఇంటికి తీసుకువచ్చారు. 20 రోజుల క్రితం మళ్లీ చాందిని తన చెల్లి ఆషియాతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనంతరం ఆమె ముంబయిలో ఉందని తెలుసుకుని.. ఇంటికి తీసుకువచ్చారు. అయితే, చాందిని ఓ యువకుడితో ప్రేమలో ఉందని ఆమె తండ్రికి తెలిసింది. దీన్ని జీర్ణించుకోలేని లల్లన్​.. చాందినిని గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం కుమార్తె మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చిపెట్టాడు.

కరెంట్ షాక్​ తగలడం వల్ల తన కుమార్తె చనిపోయిందని గ్రామస్థులను నమ్మించాడు. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తె ఆషియాను బెదిరించాడు. తన సోదరి మరణాన్ని జీర్ణించుకోలేని ఆషియా.. జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసిన పోలీసులు.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సోదరి ఆషియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తాతా.. నీతోనే నేను..
బంగాల్​లో హృదయవిదారక ఘటన జరిగింది. తాత మరణాన్ని జీర్ణించుకోలేని ఓ మనవడు బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. దక్షిణ దినాజ్​పుర్​ జిల్లా పటిరాం బిట్టూ సర్కార్​(17) తండ్రి.. 8 ఏళ్ల క్రితం చనిపోయాడు. బిట్టూ అప్పటినుంచి తన తల్లి, తాతతో కలిసి ఉంటున్నాడు. శనివారం బిట్టూ తాత చనిపోయాడు. తాత మరణాన్ని జీర్ణించుకోలేని బిట్టూ.. మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్తున్న దారిలో బ్రిడ్జి మీద నుంచి ఆత్రేయి నదిలో దూకేశాడు. దీంతో బిట్టూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బిట్టు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భార్యను గొంతు కోసి చంపి.. భర్త ఆత్మహత్య!
బంగాల్​లో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా హత్యచేశాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ మేరకు రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నదియా జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్‌పరా ప్రాంతానికి చెందిన జయంత సర్దార్​ అవే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం దీపాలి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో దీపాలి తన పుట్టింట్లో ఉంటోంది. అయినా అప్పుడప్పుడు భార్యాభర్తలు కలుసుకునేవారు. జయంత ఫోన్​ చేయడం వల్ల దీపాలి అతడిని కలవడానికి వెళ్లింది. ఆ తర్వాత రోజు చేతులు కట్టేసి.. గొంతు కోసి విగతజీవిగా దీపాలి స్థానికులకు కనిపించింది. ఆ సమీపంలోని రైల్వే ట్రాక్​పై జయంత​ మృతదేహం పడి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Mar 26, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.