కర్ణాటక, కొప్పల్ జిల్లా కుష్తగీ నగరానికి చెందిన స్పందన(8).. తన బర్త్‌డేను తండ్రి సమాధి వద్ద చేసుకోవాలని నిర్ణయించుకుంది. పుట్టినరోజున సమాధి దగ్గర కేక్ కట్ చేసింది. కేక్ ముక్కను తండ్రి సమాధి వద్ద పెట్టి నమస్కరించింది.


స్పందన తండ్రి మహేశ్ కొనసగర.. మే నెలలో కొవిడ్ బారిన పడి మృతిచెందాడు.

తండ్రి.. తన పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిపేవాడని.. తనను ఓ అధికారిగా చూడాలన్నదే ఆయన కల అని, అందుకోసం కష్టపడి చదువుకుంటానని.. స్పందన చెప్పుకొచ్చింది.
ఈ దృశ్యాలు చూసి అక్కడున్నవారి గుండె బరువెక్కింది.
ఇదీ చదవండి: Viral Fever: వణికిస్తున్న జ్వరాలు.. వారంలో 40 మందికిపైగా మృతి!