ETV Bharat / bharat

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి - తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం

accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 12, 2023, 7:44 AM IST

Updated : Jun 12, 2023, 2:13 PM IST

07:41 June 12

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident in East Godavari రహదారిపై ఆగి ఉన్న లారీ వారి పాలిట శాపంగా మారింది. ఆ లారీని గమనించని కారు డ్రైవర్​ వేగంగా వచ్చి దానిని ఢీకొన్నారు. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారు. కారు లారీని ఢీకొన్న సమయంలో కారులోనుంచి గమనించే లోపే జరగాల్సింది జరిగింది. అసలు ఏం జరుగుతుందో కారు డ్రైవర్​ తెలుసుకునే లోపే ప్రమాదం జరగటం.. కారులోని ఏడుగురి ప్రాణాలు గాలిలో కలిశాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతుల వివరాలు సేకరించారు. ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర రోడ్డు ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో సంభవించింది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వంతెనపై ఆగి ఉన్న లారీని.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు రాజమహేంద్రవరం వాసులుగా పోలీసులు గుర్తించారు. వారంతా హైదరాబాద్​లోని ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్​నగర్​కు చెందిన వ్యక్తులు హైదరాబాద్​లోని పెళ్లి వేడుకలకు వెళ్లారు. వారు వివాహానికి హాజరైన తర్వాత కారులో రాజమహేంద్రవరానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు తూర్పు గోదావరి జిల్లాలోకి రాగానే ఉదయం వేళ ప్రమాదానికి గురైంది. నల్లజర్ల మండలం అనంతపల్లిలోని జాతీయ రహదారిపై గల వంతెనపై.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడవగా మిద్దె సాయి, దుర్గకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ వాసులు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుల వివరాల కోసం ఆరా తీయగా వారు రాజమండ్రికి చెందిన వారని గుర్తించారు. ఈ ప్రమాదంలో ఏడుగురిలో నలుగురు మహిళలు ఓ చిన్నారి ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన మిద్దే సత్యనారాయణ, అరుణ, తేజ, ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్​ఎన్​డీ పేటకు చెందిన దాసరి శ్రావణి కుమారి, తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల కు చెందిన రేలంగి లక్ష్మిగా గుర్తించారు. వీరితో పాటు మృతులలో 8 నెలల బాలుడూ కూడా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించగా.. దుర్గ కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతురాలిది చాగల్లు మండలం మీనా నగరానికి చెందిన దుర్గగా పోలీసులు గుర్తించారు.

Last Updated : Jun 12, 2023, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.