ETV Bharat / bharat

Family Mass Suicide : ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్య.. ఆరుగురికి విషం ఇచ్చి.. ఆపై.. - సూరత్​లో కుటుంబం సామూహిక ఆత్మహత్య

Family Mass Suicide : ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Family Mass Suicide
Family Mass Suicide
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 4:19 PM IST

Updated : Oct 28, 2023, 6:55 PM IST

Family Mass Suicide : ఆర్థిక సమస్యలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు వృద్ధులు ఉన్నారు. గుజరాత్​లో జరిగిన ఈ ఘటన.. సంచలనం రేపింది. మృతులను మనీశ్ సోలంకి, అతడి తండ్రి కనుభాయి, తల్లి శోభనాబెన్​, భార్య రీతా, పిల్లలు దీక్ష, కావ్య, కౌశల్​గా గుర్తించారు.

ఇదీ జరిగింది..
సూరత్​లోని పలన్​పుర్​ పటియా ప్రాంతానికి చెందిన మనీశ్ సోలంకి.. తన కుటుంబంతో కలిసి సిద్దేశ్వర్ అపార్ట్​మెంట్​లో నివసిస్తున్నాడు. ఇతడు ఫర్నీచర్​ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మనీశ్​ కొన్ని రోజుల క్రితం.. కొందరికి నగదును అప్పుగా ఇచ్చాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా.. వారు ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పుగా ఇచ్చిన డబ్బు వెనక్కి వచ్చేలా లేకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన మనీశ్​ అత్మహత్యకు సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లిదండ్రులతో పాటు భార్యాపిల్లలకు విషం ఇచ్చాడు మనీశ్. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే, మనీశ్​ ఇంట్లో నుంచి వాసన రావడం వల్ల అనుమానించిన స్థానికులు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్ట్​మార్టం​ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

"ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్​ నోట్​ను రాశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం."
--రాకేశ్​ బరోత్​, సూరత్ డీసీపీ

కుమార్తెను వేధిస్తున్నాడని భర్తపై కేసు.. రైలు కింద పడి ఆత్మహత్య
కుమార్తెను వేధిస్తున్నాడని భర్తపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది.

ఇదీ జరిగింది
బద్లాపుర్​కు చెందిన 31 ఏళ్ల మహిళ.. ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ కోసం.. పిల్లల బాధ్యతలు భర్తకు అప్పిగించి దుబాయ్​కు వెళ్లింది భార్య. దీనిని ఆసరాగా తీసుకున్న భర్త.. 11 ఏళ్ల కూతురిని లైంగికంగా వేధించాడం మొదలుపెట్టాడు. ఇటీవలె బాధితురాలు అమ్మమ్మ ఇంటికి వెళ్లగా అనారోగ్యం పాలైంది. దీంతో ఆస్పత్రికి తరలించగా.. అసలు విషయం బయట పడింది. ఈ విషయం తెలిసిన బాధితురాలి అమ్మ వెంటనే భారత్​కు వచ్చి తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తుండగా పట్టాలపై శవమై కనిపించాడు.

Lady Constable Suicide : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై 500 గాయాల మరకలు.. ఏం జరిగింది?

Old Man Suicide After Raped Girl : ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య

Last Updated : Oct 28, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.