ETV Bharat / bharat

ఫేక్​ ఆన్​లైన్​ పోర్ట​ల్​తో రూ. 5లక్షల మోసం - online fraud complaint

ఫేక్​ స్నాప్​డీల్​ వెబ్​సైట్​కు(fake snapdeal call) చిక్కిన ఓ వ్యక్తి రూ. 5లక్షలు పోగొట్టుకున్నాడు. రూ. 18లక్షల కానుక పంపిస్తామని, ఇందుకోసం రూ. 5లక్షలు చెల్లించాలని వచ్చిన ఫోన్​ కాల్​ను అతడు నమ్మి మోసపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది(online fraud complaint).

online fraud
ఆన్​లైన్​ మోసం
author img

By

Published : Oct 9, 2021, 3:59 PM IST

తమిళనాడులో మరో ఆన్​లైన్​ మోసం బయటపడింది(online fraud complaint). పెరంబర్​ ప్రాంతంలో.. ఓ ఫేక్​ స్నాప్​డీల్​ వెబ్​సైట్​కు(fake snapdeal call) బాధితుడయ్యాడు వినోద్​ అనే వ్యక్తి. ఈ వ్యవహారంలో రూ. 5లక్షలు పోగొట్టుకున్నాడు.

ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వినోద్​.. కొన్ని రోజుల క్రితం ఆన్​లైన్​ షాపింగ్​ వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకున్నాడు. అది ఫేక్​ వెబ్​సైట్​ అని అతడికి తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ సైట్​ నుంచి వస్తువులు కొనుగోలు చేశాడు. అది జరిగిన కొన్ని రోజులకు.. షూలు అతడికి ఫ్రీ గిఫ్ట్​గా వచ్చాయి.

షూ అందుకున్న తర్వాతి రోజే, వినోద్​కు ఆన్​లైన్​ పోర్టల్​ నుంచి ఓ ఫోన్​ వచ్చింది. రూ. 18లక్షలు విలువైన బహుమతి అతడు పొందినట్టు, చెక్​ పంపిస్తామని ఫోన్​లో చెప్పారు. అందుకోసం వినోద్​ రూ. 5లక్షలు చెల్లించాలన్నారు. అది నమ్మేసిన వినోద్​.. రూ. 5లక్షలు కట్టేశాడు.

ఆన్​లైన్​ పోర్టల్​లో రూ. 18లక్షలు విలువైన కానుకను పొందినట్టు వినోద్​.. అతడి స్నేహితులతో చెప్పుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ స్నేహితుడు వినోద్​ను అప్రమత్తం చేశాడు. ఇలాంటి మోసాలు బయట ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్పాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వినోద్​.. వెంటనే ఒట్టారి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మోసానికి పాల్పడిన వారు దిల్లీలో ఉంటారని, ప్రజలకు కానుకలు, డబ్బుల వల వేసి దోచుకోవడం వారికి అలవాటని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఇలాంటి మోసాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెన్నై పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు వినోద్​.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.