Jo Joseph fake porn case: కేరళ తిక్కకరా ఉపఎన్నికలో పోటీ చేస్తున్న ఎల్డీఎఫ్ అభ్యర్థి ఫేక్ పోర్న్ వీడియో కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్డీఎఫ్ తరఫున డాక్టర్ జో జోసెఫ్ తిక్కకరా ఉపఎన్నికలో బరిలో ఉన్నారు. ఇటీవల ఆయన పేరు మీద ఓ నకిలీ పోర్న్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో అప్లోడ్ చేసినట్లు భావిస్తున్న వ్యక్తిని తాజాగా తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుడు ఎర్నాకుళంకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ఫేక్ పోర్న్ వీడియోపై కామెంట్లు చేసి, షేర్ చేసిన నలుగురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తిని ప్రస్తుతం అరెస్టు చేయలేదని.. అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడిని ప్రశ్నించి, ఫోన్ను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీపీఎం నేత ఎం స్వరాజ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి యూడీఎఫ్లోని.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీకి చెందినవాడని ఆరోపణలు వస్తున్నాయి. తనను లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని యూడీఎఫ్ కుట్రలు పన్నుతోందని అభ్యర్థి జోసెఫ్ ఆరోపించారు. కాగా, వామపక్షాల వాదనను యూడీఎఫ్ నేతలు ఖండిస్తున్నారు. ఎల్డీఎఫ్లో అంతర్గత సమస్యలు ఉన్నాయని, దాని ఫలితంగానే వీడియో వైరల్ అవుతోందని అన్నారు. సొంత శిబిరం నుంచే ఫేక్ వీడియో బయటకు వచ్చిందనే విషయాన్ని దాచేందుకు లెఫ్ట్ కూటమి అబద్దాలు చెబుతోందని అన్నారు.
ఇదీ చదవండి: