తమిళనాడు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సి. విజయ భాస్కర్ నివాసంలో (Vijaya Baskar Raid) ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (డైరక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్- డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. విజయ భాస్కర్ సహా అతని కుటుంబీకులకు చెందిన 43 ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు (Vijaya Baskar Raid) నిర్వహించారు.
చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, కోయంబత్తూర్, తిరుచ్చి, పుడుకొట్టాయ్లలో ఈ సోదాలు (Vijaya Baskar Raid) జరిగినట్టు తెలుస్తోంది.
విజయభాస్కర్, సతీమణి రమ్య సహా ఆయన కుటుంబీకుల పేరున రూ.27.22 కోట్లు విలువ చేసే అక్రమాస్తులు ఉన్నట్లు డీవీఏసీ ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2016 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య అవినీతి జరిగినట్లు అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
విజయభాస్కర్ కుటుంబీకులు మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్ట్ సహా పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారని డీవీఏసీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
విజయ భాస్కర్‌తో పాటు మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, ఎంఆర్ విజయ భాస్కర్, కేసీ వీరమణిపైన కూడా డీవీఏసీ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది.
ఇదీ చూడండి : మతకలహాలకు ఐఎస్ఐ కుట్ర.. ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్