ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​

Jammu Kashmir encounter: ఉగ్రవాదంపై పోరులో భారత భద్రతా బలగాలు కీలక పురోగతి సాధించాయి. జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో ముగ్గురు పాకిస్థానీ ముష్కరుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అమరుడయ్యారు.

Baramulla encounter
Baramulla encounter
author img

By

Published : May 25, 2022, 11:40 AM IST

Updated : May 25, 2022, 1:00 PM IST

Jammu Kashmir encounter: జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీసు అమరుడయ్యారు. చనిపోయిన ముష్కరులు పాకిస్థాన్​కు చెందిన జైషే మహ్మద్​ సంస్థకు చెందిన వారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు పోలీసులు తెలిపారు.

"జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను మట్టుబెట్టాం. వారు గత నాలుగు నెలలుగా చురుకుగా ఉన్నారు. వారి కదలికలపై ఇప్పటివరకు నిఘా పెట్టాం. ఈ ఎన్​కౌంటర్​లో ఒక పోలీసు వీరమరణం పొందారు."

-విజయ్​ కుమార్, కశ్మీర్​ ఐజీపీ

బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో గాయపడి.. ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి: మరో పరువు హత్య.. 'నాన్నా.. నన్ను చంపొద్దు ప్లీజ్​'.. ఆడియో వైరల్

Last Updated : May 25, 2022, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.