ETV Bharat / bharat

వృద్ధురాలిపై ఏనుగు పగ.. అంత్యక్రియల్లోనూ దాడి - ఒడిశా ఏనుగు బీభత్సం

Elephant Tramples Woman: ఒడిశాలో ఓ ఏనుగు ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వృద్ధురాలిని కిందపడేసి తొక్కేసి చంపేసింది. మరల పగ తీరలేదన్నట్లు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు వృద్ధురాలి శవాన్ని కింద పడేసి తొక్కింది. ఈ ఏనుగు వింత ప్రవర్తన చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు.

elephant tramples woman
వృద్దురాలిపై ఏనుగు దాడి
author img

By

Published : Jun 12, 2022, 4:55 PM IST

Elephant Tramples odisha Woman: జనావాసాల్లోకి వచ్చే ఏనుగులు ఒక్కోసారి స్థానిక ప్రజలపై దాడులు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇలా ఒడిశాలో ఓ ఏనుగు వింత ప్రవర్తనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియల సమయంలోనూ ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇలా వృద్ధురాలిని చంపిన ఘటనలో ఏనుగు వింత ప్రవర్తన అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

ఒడిశా మయుర్‌భంజ్‌ జిల్లా రాయ్‌పాల్‌ గ్రామంలో మాయా ముర్ము అనే ఓ వృద్ధురాలు గొట్టపుబావి నుంచి నీటిని తీసుకుంటోంది. అదే సమయంలో దాల్మా వన్యప్రాణల సంరక్షణ కేంద్రం నుంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. కిందపడేసి తొక్కడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రస్‌గోవింద్‌పుర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాయక్‌ వెల్లడించారు.

అదే రోజు సాయంత్రం మాయా ముర్ము మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఏనుగు చితిపై ఉన్న వృద్ధురాలి మృతదేహంపై మరోసారి దాడి చేసింది. మృతదేహాన్ని కింద పడేసి తొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. కొద్దిసేపటి తర్వాత అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇవీ చదవండి: 200కేజీల బరువు.. ఇద్దరు భార్యలు.. ఈ భారీకాయుడి మెనూ చూస్తే..

పెళ్లింట తీవ్ర విషాదం.. రంగులు పడ్డాయని గొడవ.. కాల్పుల్లో వధువు సోదరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.