ETV Bharat / bharat

ఆమెను బలిగొన్న ఈ-బైక్.. ఛార్జింగ్​ పెడుతుంటే ఒక్కసారిగా...

ఈ-బైక్​ కారణంగా మరో ప్రాణం పోయింది. స్కూటర్​కు ఛార్జింగ్​ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి 23 ఏళ్ల యువతి మరణించింది. మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆదివారం జరిగిందీ ఘటన.

ebike accidents
ఈ-బైక్​కు ఛార్జింగ్​ పెడుతుంటే షాక్.. యువతి మృతి
author img

By

Published : May 23, 2022, 1:15 PM IST

Updated : May 23, 2022, 1:36 PM IST

ఎలక్ట్రిక్​ బైక్​కు ఛార్జింగ్​ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రోలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో యువతి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతురాలి పేరు శివానీ అనిల్ పాటిల్. కొంతకాలం క్రితం ఆమె కుటుంబసభ్యులు ఈ-బైక్ కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎలక్ట్రిక్ స్కూటర్​కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది శివానీ. ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి.. విలవిల్లాడుతూ కుప్పకూలింది.
అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై కరాడ్ గ్రామీణ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ebike accidents
మృతురాలు శివానీ అనిల్ పాటిల్

వరుస ప్రమాదాలు: దేశంలో ఈ-బైక్స్​కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. అయితే.. అదే సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల కారణంగా అనేక ప్రమాదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఎలక్ట్రిక్​ బైక్​ ఛార్జింగ్​ చేస్తుండగా మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు, వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్​లో మార్చి 26 రాత్రి జరిగింది.

తమిళనాడులోనే తిరువళ్లూరులో ఇంటిముందు పార్క్​ చేసిన స్కూటర్​ కాలిపోవడమే కాకుండా.. ఇంట్లోని సుమారు 3 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. కొంతకాలం క్రితం సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ డిపోలో ఓ ఎలక్ట్రిక్​ బస్సు ఛార్జింగ్​ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. కర్ణాటక శివమొగ్గ జిల్లాలో ఛార్జింగ్​ చేస్తుండగా ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయింది. మహారాష్ట్ర పుణెలోనూ ఓ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Last Updated : May 23, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.