ETV Bharat / bharat

రెండు భవనాల వరకే భూకంపం!.. స్థానికులు హడల్.. 4.4తీవ్రతతో ప్రకంపనలు - తమిళనాడు భూకంపం

తమిళనాడులో రెండు భవనాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో అందులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు, ఉత్తరాఖండ్​లో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.

earthquake-tremors-in-chennai-tamilnadu
తమిళనాడులో భూప్రకంపనలు
author img

By

Published : Feb 22, 2023, 10:49 PM IST

Updated : Feb 22, 2023, 10:56 PM IST

సాధారణంగా ఎక్కడైనా భూకంపం వస్తే ఊళ్లకు ఊళ్లు ప్రభావితం అవుతాయి. ఏదైనా పెద్ద నగరంలో భూకంపం వస్తే.. ఆ నగరంలోని కొంత భాగమైనా కంపిస్తుంది. అయితే తమిళనాడు చెన్నైలో జరిగిన ఘటన స్థానికుల్లో అనుమానాలకు కారణమైంది. రెండంటే.. రెండే భవనాల్లో ప్రకంపనలు వచ్చాయి. చెన్నై మౌంట్ రోడ్​లోని అన్నా సలాయ్ ప్రాంతంలో ఉన్న రెండు భవనాలు కంపనానికి గురయ్యాయి. చుట్టు పక్కల ఉన్న ఇతరులు ఎవరికీ ఈ ప్రకంపనాల గురించి తెలియలేదు. కేవలం రెండు భవనాల్లోనే ప్రకంపనలు వచ్చేసరికి స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది.

మౌంట్​రోడ్​లో ఉన్న రెండు భారీ బహుళ అంతస్తుల భవనాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో అందులో ఉండే వారంతా బయటకు పరుగులు పెట్టారు. భూకంపం అనుకొని ఆందోళన చెందారు. అయితే, సమీపంలోని వారంతా ఎలాంటి భయం లేకుండా తమ పనుల్లో ఉండిపోయారు. భవనంలో ప్రకంపనలు వచ్చాయని తెలియగానే ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిజంగా అది భూకంపమా కాదా అనే ప్రశ్నలు, అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో జరుగుతున్న మెట్రో పనుల వల్ల ప్రకంపనలు వచ్చి ఉంటాయని కొందరు అనుమానించారు. దీంతో మెట్రో ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్​ను ఈటీవీ భారత్ సంప్రదించింది. అయితే, అన్నా సలాయ్ ప్రాంతానికి సమీపంలో మెట్రో నిర్మాణ పనులేవీ చేపట్టడం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే, అన్నా సలాయ్ ప్రాంతానికి సమీపంలో ఓ భవన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్లే ప్రకంపనలు వచ్చి ఉంటాయని అధికారులు వెల్లడించారు.

earthquake-tremors-in-chennai-tamilnadu
ప్రకంపనలు వచ్చిన భవనం
earthquake-tremors-in-chennai-tamilnadu
ప్రకంపనలు వచ్చిన భవనం

4.4 తీవ్రతతో భూకంపం..
మరోవైపు, ఉత్తరాఖండ్​లోని పితోరాగఢ్​లో భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పితోరాగఢ్​లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. భూకంప కేంద్రం పితోరాగఢ్​కు తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో ఉందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. భారత్- చైనా సరిహద్దులోని ప్రాంతాలతో పాటు నేపాల్​లోనూ ఈ భూకంపం ప్రభావం చూపిందని తెలిపింది. పితోరాగఢ్​లో భూకంపం తర్వాత దిల్లీ సహా ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.

ఓవైపు తుర్కియేలో వరుస భూకంపాలు కల్లోలం సృష్టించిన నేపథ్యంలో దేశంలోనూ ప్రకంపనలు రావడం కలకలం రేపుతోంది. భారత్​లో భారీ భూకంపం వచ్చేందుకు ఆస్కారం ఉందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరించారు. 7.5 తీవ్రతతో భారీ భూకంపం వస్తుందని ప్రముఖ భూకంప శాస్త్ర నిపుణుడు డాక్టర్ పూర్ణచంద్ర రావు ఇటీవల హెచ్చరించారు. టర్కీలో సంభవించిన దాని కంటే శక్తివంతమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని ఇటీవల పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​కు ఈ ముప్పు పొంచి ఉందని చెప్పారు.

ఈ ప్రాంతంలో గడిచిన 200 ఏళ్లలో భారీ భూకంపం రాలేదని, కాబట్టి త్వరలోనే భూమిలోని ఫలాకాలు మార్పిడి చెందడం వల్ల ముప్పు తలెత్తవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా ఫలకాలు కదిలితే భారీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అగ్ని పర్వతం బద్ధలై లావా బయటకు వచ్చినట్టు.. భూకంపం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు.

Last Updated : Feb 22, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.