జమ్ముకశ్మీర్‌లోని కనచక్ ప్రాంతంలో శుక్రవారం మరోసారి డ్రోన్ సంచారం కలకలం సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు. దాంతో ఆ డ్రోన్ కింద పడింది. డ్రోన్ నుంచి 5 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


బుధవారం సత్వారీ ప్రాంతంలో ఓ అనుమానిత డ్రోన్‌ను అధికారులు గుర్తించారు. అంతకుముందు జులై 16న.. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) ఏర్పాటు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్ రాడార్స్.. జమ్ముకశ్మీర్ ఎయిర్ బేస్‌పై తిరుగుతున్న డ్రోన్ జాడను పసిగట్టాయి. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో.. అప్రమత్తమైన ఎన్ఎస్జీ ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది.
ఇవీ చూడండి: