ETV Bharat / bharat

రాజకీయ పార్టీల విరాళాలపై కొవిడ్​ దెబ్బ.. 41% డౌన్​ - DIP DONATIONS

Donations to Political Parties: ప్రపంచ దేశాలను వణికించి, సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్​ మహమ్మారి ప్రభావం రాజకీయ పార్టీలను తాకింది. కొవిడ్ కారణంగా పార్టీలకు వచ్చే విరాళాలకు భారీగా కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలకు అందిన వివరాలతో విడుదలైన ఏడీఆర్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

Donations to national parties plunged 41.49 pc in 2020-21 against previous yr: ADR

author img

By

Published : Jul 14, 2022, 7:31 PM IST

Donations to Political Parties: సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. మహమ్మారి దెబ్బకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల విరాళాలు భారీగా తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో జాతీయ పార్టీల విరాళాలు.. 41.49 శాతం తగ్గినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో.. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు విరాళాలు రూ. 420కోట్ల మేర తక్కువగా వచ్చినట్లు తెలిపింది.

  1. అధికార భాజపాకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 785.77 కోట్ల రూపాయల విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి 477.54 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్​) నివేదిక పేర్కొంది.
  2. విపక్ష కాంగ్రెస్‌కు 2019-20లో 139 కోట్ల రూపాయలు విరాళంగా అందగా.. 2020-21లో 46.39 శాతం తగ్గి రూ. 74.52 కోట్లు మాత్రమే వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.

ఏడీఆర్​ నివేదిక ప్రకారం..

  • జాతీయ పార్టీలకు దిల్లీ నుంచి రూ. 246 కోట్లు, మహారాష్ట్ర నుంచి రూ. 71.68 కోట్లు, గుజరాత్ నుంచి 47 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి.
  • 2020-21కి సంబంధించి జాతీయపార్టీలకు అందిన విరాళాల్లో 80శాతానికి పైగా కార్పొరేట్ సంస్థలు, వ్యాపార రంగం నుంచే అందాయి.
  • మొత్తం రూ. 480.65 కోట్లు వ్యాపార రంగం నుంచి జాతీయ పార్టీలకు విరాళాల రూపంలో అందింది.
  • అధికార భాజపాకు కార్పొరేట్, వ్యాపార రంగం నుంచి సుమారు 11 వందల విరాళాలు అందగా.. వీటి విలువ రూ. 416.79 కోట్లు.
  • విపక్ష కాంగ్రెస్‌కు ఆయా వర్గాల నుంచి 146 విరాళాలు అందగా.. వాటి విలువ 38.63 కోట్ల రూపాయలు.

ఇవీ చూడండి: 8 ఏళ్లుగా రేప్.. మహిళ ఆత్మహత్య- కూతురి జననాంగాల్లో వేడి నూనెపోసి..

వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ.. 29 గ్రామాలు ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.