ETV Bharat / bharat

క్యాన్సర్​ రోగి కడుపులో 30 కిలోల కణితి.. వైద్యుల ఆపరేషన్​తో లక్కీగా! - మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్

క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ రోగి కడుపులో నుంచి 30 కిలోల కణితిని తొలగించారు ఉత్తర్​ప్రదేశ్​ వైద్యులు. ఈ ఆపరేషన్ కోసం ఆరు గంటల పాటు శ్రమించారు.

Doctors Removed 30 kg Tumor from Cancer Patient Stomach
క్యాన్సర్ రోగి కడుపులో 30 కిలోల కణితి
author img

By

Published : Feb 24, 2023, 9:35 PM IST

Updated : Feb 24, 2023, 9:40 PM IST

అరుదైన క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ రోగి కడుపులో నుంచి 30 కిలోల కణితిని తొలగించారు ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి వైద్యులు. దాదాపు ఆరు గంటల పాటు ఈ ఆపరేషన్​ కోసం వైద్యులు శ్రమించారు. వారణాసిలోని మహామన పండిట్ మదన్ మోహన్ మాళవియా క్యాన్సర్ సెంటర్​లో ఈ ఆపరేషన్ జరిగింది. దేశంలోనే ఇదోక అతిపెద్ద ఆపరేషన్​గా వైద్యులు చెబుతున్నారు. 55 ఏళ్ల వ్యక్తి కడుపులో ఆ భారీ కణితిని గుర్తించిన వైద్యులు.. అనంతరం ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.

ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అయిన​ డాక్టర్ మయాంక్ త్రిపాఠి ఈ ఆపరేషన్​ గురించి వివరించారు. "కడుపు నొప్పితో ఓ 55 ఏళ్ల వ్యక్తి మమ్మల్ని సంప్రదించాడు. అతడు అప్పటికే రెట్రోపెరిటోనియల్ లిపోసార్కోమా అనే అరుదైన క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. అతడికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. అనంతరం.. అతడి కడుపులో 30 కిలోల కణితిను గుర్తించాం. దాదాపు ఆరు గంటలపాటు కష్టపడి ఈ ఆపరేషన్ పూర్తి చేశాం. కడుపులో చాలా సున్నితమైన ప్రదేశంలో కణితి ఉన్న కారణంగా.. ఆపరేషన్​కు చాలా సమయం పట్టింది" అని ఆయన తెలిపారు.

Varanasi Doctors Success Remove 30 kg Tumor From Cancer Patient Stomach
కాన్సర్​ రోగి కడుపులో 30 కిలోల కణితి.. వైద్యుల ఆపరేషన్​తో సేఫ్​గా..

ఈ కణితి బరువు.. అప్పుడే పుట్టిన 12 మంది పిల్లలతో సమానమని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు. ఈ కణితి 34 సెంటీమీటర్ల పొడవు, 46 సెంటీమీటర్ల వెడల్పు ఉందని వెల్లడించారు. బహుశా ఇది దేశంలోనే అతిపెద్ద కణితి అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడం పట్ల పేషెంట్​ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Last Updated : Feb 24, 2023, 9:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.