ETV Bharat / bharat

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​! - దీపావళి డెకరేషన్​ ఐడియాస్​

Diwali Decorations Ideas 2023: దీపావళి రోజున మీ ఇంటిని ఎలా అలంకరించన్నారు? ఇప్పటి వరకూ ఏమీ ప్లాన్ చేయకపోయిన వారు.. రెగ్యులర్​గా ఒకే స్టైల్​లో డెకరేట్ చేస్తున్నవారు.. తప్పకుండా ఈ స్టోరీ చదవండి. చూడ్డానికి అందంగానే కాకుండా.. పండగ స్ఫూర్తిని, భక్తి భావాన్ని స్ఫురింపజేసేలా.. మీ ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు.

diwali decoration ideas 2023
diwali decoration ideas 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 11:15 AM IST

Diwali Decorations Ideas 2023 in Telugu: దీపావళి అంటేనే వెలుగుల పండగ. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఈ పండగంటే ఎంతో ఇష్టం. దీపాలు, టపాకాయలు, విద్యుత్​ దీపాల అలంకరణలు, పూజలు, అందమైన రంగవల్లులు.. ఇవన్నీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని తెచ్చి పెడతాయి. ఇంత ప్రత్యేకమైన పండగకు మీ ఇంటిని అంతే స్పెషల్​గా తీర్చిదిద్దకపోతే ఎలా చెప్పండి? అందుకే.. మీకోసం సూపర్ డెకరేషన్​ ఐడియాస్ తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిపై ఓ లుక్కేయండి. నచ్చితే ఫాలో అయిపోండి.

దీపావళి పండగ అంటేనే.. దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అందుకు తగినట్లుగా ముందు ఇంటిని సర్దుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడంతోనే.. అప్పటి వరకూ ఉన్న పాత రూపురేఖలు మారతాయి.

గుమ్మాల అలంకరణ: పండగకు ముందు రోజే.. గుమ్మాలు, తలుపులను పూలతో అలకరించుకోండి. పండగ వేళ పూలను మించిన డెకరేషన్​ దేనితోనూ రాదు. మామూలుగా కాకుండా మామిడాకులతో చిలకలు, రకరకాల డిజైన్స్​ చేసి మధ్య మధ్యలో పెడితే ఇంటికి కొత్త లుక్​ వస్తుంది.

అందమైన రంగవల్లులు: పండగ రోజు దీపాలు పెట్టేందుకు వీలుగా రకరకాల రంగులతో, పూలతో ముగ్గులు వేయండి. వాటిలో దీపాలు పెడితే లుక్​ సూపర్​గా ఉంటుంది.

దీపావళి గిఫ్ట్ - ఇలా ప్లాన్ చేస్తే అదుర్స్!

రంగు రంగుల దీపాలు: దీపావళి నాడు మీ ఇంటిని అందమైన దీపాలు, రంగురంగుల లైట్లతో అలంకరించండి. మట్టి దీపాలకు మీకు నచ్చిన రంగులతో పెయింట్ చేసి ఉంచితే.. అవి మరింత ఆకర్షణగా ఉంటాయి.

గోడలపై మరకలు ఇలా మాయం: దీపావళి నాడు ఎక్కువ మంది పిట్ట గోడలపై దీపాలు పెడతారు. అలా పెట్టినప్పుడు దీపాల నుంచి నూనె కారి.. గోడలపై పడి మరకలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. దివ్వెల కింద ఆకు వేసి, అందులో కాస్త ఇసుకను పోసి, వాటిపై దివ్వెలు పెట్టి.. దీపాలు వెలిగించండి. అప్పుడు నూనెతో ఇబ్బంది ఉండదు. ఒకవేళ కారినా దాన్ని ఇసుక పీల్చుకుంటుంది.

దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్​, అదిరే ఫీచర్లు మీ సొంతం!

ఫ్లోటింగ్​ క్యాండిల్స్​: ఈ పండుగ కోసం ప్రత్యేకంగా ఫ్లోటింగ్​ క్యాండిల్స్​ అందుబాటులో ఉన్నాయి. ఇత్తడి ఉర్లీలో పూలను అందంగా పేర్చి, ఆ మధ్యలో ఇలా ఫ్లోటింగ్​ క్యాండిల్స్​ను వెలిగించి పెట్టండి. హాల్​లో దీనిని పెట్టుకుంటే దీపపు కాంతులతో ఇల్లు వెలిగి పోతుంది. మనసుకూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

విద్యుత్​ దీపాలు: మార్కెట్లో రకారకాల విద్యుత్​ దీపాలు, సీరియల్​ లైట్లు, దీపపు కుందెనలాంటి దీపాలు అందుబాటులో ఉంటున్నాయి. రకారకాల రంగుల్లో ఉండే ఆ లైట్లను తెచ్చుకుని నచ్చినట్లుగా అలకరించుకోండి.

రంగు కాగితాలతో డిజైన్స్​: కలర్​ పేపర్స్​ తెచ్చి.. పేపర్​ పువ్వులు, దీపాలుగా కత్తిరించండి. వాటిని తోరణాల మాదిరిగా దారానికి అంటించి వేలాడదీయండి. ఇంకా.. ఈ పేపర్లతో రకరకాల లాంతర్ డిజైన్లు తయారు చేసి.. వాటి లోపల లైట్లు అమర్చండి. ఇలా చేస్తే.. మీ ఇంటి లుక్కే మారిపోతుంది.

లోన్​ తీసుకునే వారికి గుడ్​న్యూస్​-దీపావళి సందర్భంగా బ్యాంకుల బంపరాఫర్​!

ఫ్లిప్​కార్ట్​ "బిగ్​ దివాళీ సేల్​" - ఆ స్మార్ట్​టీవీలపై భారీ తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.