ETV Bharat / bharat

గోదావరి-కావేరి నదుల అనుసంధానం.. ఇంతకీ అధికారులు ఏం తేల్చారంటే?

NWDA Meeting LatesT news: హైదరాబాద్‌ జలసౌధలో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. తమ ప్రాజెక్టులను ఆమోదించిన తర్వాత మిగులు జలాలను తీసుకుంటే ఇబ్బంది లేదని తెలంగాణ తెలిపిందని కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెల్లడించారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ ఆమోదం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Discussions today on Godavari Kaveri River Linkage
గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై ప్రారంభమైన NWDA సమావేశం
author img

By

Published : Mar 6, 2023, 3:38 PM IST

NWDA Meeting Today: హైదరాబాద్ జలసౌధలో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ భేటీ ముగిసింది. ఎన్‌డబ్ల్యూడీఏ సంస్థ ఛైర్మన్ భోపాల్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ పాల్గొన్నారు. ఈయనతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సమావేశంలో చర్చించారు.

అయితే ఈ సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ సమావేశం వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో రెండు లింక్స్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. ఒకటి రాజస్తాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడే.. పర్వతీ - చంబల్ లింక్ పైన చర్చ జరిగిందని తెలిపారు. వీటిపై చర్చించి ఆయా రాష్ట్రాల అధికారులకు అభిప్రాయాలు పంపించినట్లు వెల్లడించారు. ఇక రెండోది సౌత్ రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి లింక్ గురించి చర్చించినట్లు వివరించారు. డీపీఆర్‌పై ఇప్పటికే అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తెలిపాయన్న వెదిరె శ్రీరామ్.. సూత్రప్రాయంగా అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయన్నారు.

తమ ప్రాజెక్టులను ఆమోదించిన తర్వాత మిగులు జలాలను తీసుకుంటే ఇబ్బంది లేదని తెలంగాణ తెలిపిందని వెల్లడించారు. డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారని తెలిపారు. మార్గదర్శకాలకు లోబడి డీపీఆర్‌లు ఆమోదిస్తామని చెప్పామని స్పష్టం చేశారు. సాంకేతిక అంశాలను పరిశీలించి ఇచ్చం పల్లికి అటూ ఇటుగా ఆనకట్ట నిర్మిస్తామని చెప్పారు. తమ వాటాకు ఇబ్బంది ఉండరాదని ఏపీ పేర్కొన్నట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ కేటాయింపులు కాకుండా మిగిలిన జలాలనే తరలిస్తామని వెల్లడించారు.

దీనిపై ఛత్తీస్‌గఢ్ ఆమోదం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తమకు వాటా పెంచాలని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు కోరాయని తెలిపారు. 90:10 నిష్పత్తిలో నిధుల ఖర్చు జరిగిందన్నారు. అన్ని రాష్ట్రాలు ఒప్పించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌తో విడిగా చర్చలు జరుపుతామన్న ఆయన... వాళ్ల మిగులు నీటి వినియోగం, పరిహారం అంశాలపై చర్చిస్తామని వివరించారు.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్థాయిలో ఛత్తీస్‌గఢ్‌తో చర్చ జరుగుతోంది. ఆరు నెలల్లో గోదావరి - కావేరీ లింక్‌పై రాష్ట్రాలు ఏకాభిప్రాయం సాధిస్తాం. జాతీయ నదుల అనుసంధాన సంస్థ - నీరా త్వరలో ఏర్పాటు అవుతుంది. అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. గోదావరి - కావేరీ అనుసంధానంలో మొదటి దశలో 141 టీఎంసీల నీటిని తరలించాలని ప్రతిపాదన ఉంది. 43 వేల కోట్లు అంచనా వ్యయం అవుతుందని అంచనా ఉంది. గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం ఇప్పటికే తేల్చింది. కానీ వరద సమయంలో వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. ఇక నుంచి దేశంలో నిర్మించే అన్ని ప్రాజెక్టులను డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి చేస్తాం. - వెదిరె శ్రీరామ్‌, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు

ఇక ఎక్కువ భూమి పోతున్నందున గోదావరి - కావేరీ అనుసంధాన ప్రక్రియలో తరలించే నీటిలో సగం తెలంగాణకు ఇవ్వాలని కోరారని తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం కాల్వలను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రతిపాదించిందని తెలిపారు. ఎన్‌డబ్ల్యూడీఏ సంస్థ ఛైర్మన్ భోపాల్ సింగ్ మాట్లాడుతూ... నదుల అనుసంధానంపై మంచి చర్చ జరిగింది. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి. ఏకాభిప్రాయంపై కసరత్తు కొనసాగుతుంది'' అని అన్నారు.

తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరాం, ఇస్తామని చెప్పారు. 50 శాతం నీరు కావాలని కోరాం, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆనకట్ట నిర్మించే ప్రాంతాన్ని ఖరారు చేస్తాం. అందరి అవసరాల కోసం సమ్మక్క ఆనకట్టను వినియోగించుకుంటే బాగుండేది'' అని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.