ETV Bharat / bharat

మోదీపై విమర్శలు చేసేది అలాంటి వారే: దిగ్గజ దర్శకుడు - ప్రధాని మోదీ

Tamil director Bhagyaraj on Modi: చెన్నైలో జరిగిన 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్​' పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తమిళ దర్శకుడు​ భాగ్యరాజ్​. ప్రధాని మోదీపై విమర్శలు చేసేది నెల తక్కువ వారేనని పేర్కొన్నారు.

Director Bhagyaraj
తమిళ డైరెక్టర్​ భాగ్యరాజ్​
author img

By

Published : Apr 20, 2022, 5:26 PM IST

Tamil director Bhagyaraj on Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించేవారు పరిపక్వత లేనివారై ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు​ భాగ్యరాజ్​. చెన్నై, త్యాగరాయనగర్​లోని భాజపా ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్​ 20) 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తమిళ డైరెక్టర్​ భాగ్యరాజ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

" నేను బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఐపీఎస్​ అధికారి అన్నామలై(ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్షుడు)పై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు భాజపా నాయకుడిగా సరైన వ్యక్తిని నియమించారని చెప్పారు. కొందరు విమర్శకులు సరైన రీతిలో మాట్లాడరు, ఎదుటివారు చెప్పేది వినరు. అలాంటి విమర్శకులు తమను తాము పరిపక్వత లేనివారుగా భావించాలి."

- భాగ్యరాజ్​, ప్రముఖ దర్శకుడు.

Director Bhagyaraj
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళ డైరెక్టర్​ భాగ్యరాజ్​

పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తమిళనాడు భాజపా నేత అన్నామలై, విశ్రాంత​ ఐఏఎస్​ అధికారి సెల్వరాజ్​, నటుడు శివాజీ గణేశన్​ కుమారుడు, నిర్మాత రామ్​కుమార్​ హాజరయ్యారు. వారికి పుస్తకం కాపీలను అందించారు నిర్వాహకులు.

ఇదీ చూడండి: 'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర.. వారికి ప్రత్యేక వీసా'

మామూలోడు కాదు.. ఐపీఎల్​ మ్యాచ్​లను సొంత యాప్​లో పెట్టేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.