ETV Bharat / bharat

'రైతులపై వరుస దాడులు.. నియంత పాలనలో దేశం' - రాహుల్ గాంధీ తాజా వార్తలు

ప్రస్తుతం దేశంలో నియంత పాలన నడుస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శించారు. రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన​లో(Lakhimpur Kheri Incident) బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమకు ప్రభుత్వం అనుమతించటం లేదని చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Oct 6, 2021, 12:06 PM IST

రైతులపై వరుస దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని విమర్శించారు. లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో(Lakhimpur Kheri Incident) బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ నాయకులను అనుమతించటం లేదని చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనకు సిద్ధమైన రాహుల్(Rahul Gandhi News)​.. దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

"రైతులపై జీపు దూసుకువెళ్లింది. వారిని హత్య చేశారు. దీంట్లో కేంద్ర మంత్రి, అతని కుమారుడి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది. కానీ, ఇప్పుడు నియంత పాలన నడుస్తోంది. రాజకీయ నాయకులు ఉత్తర్​ప్రదేశ్​కు వెళ్లలేరు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

"పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జీత్ సింగ్ చన్నీ, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​తో కలిసి కలిసి మేం ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటిస్తాం"అని రాహుల్ పేర్కొన్నారు. లఖింపుర్ ఘటనపై(Lakhimpur Kheri Incident) ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.

అనుమతించం..

మరోవైపు.. లఖింపుర్​ ఖేరి, సితాపుర్​లో పర్యటించేందుకు రాహుల్​ను అనుమతించబోమని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు తెలిపారు. ఆయన పర్యటనతో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

"రాహుల్ గాంధీ పర్యటనకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. లఖింపుర్​, సితాపుర్​కు రావద్దని ఆయనను కోరాం. ఆయా జిల్లాల్లో రాహుల్ పర్యటిస్తే.. సమస్యలు తలెత్తుతున్నాయని సంబంధిత జిల్లా కలెక్టర్లు మాకు లేఖ రాశారు. రాహుల్​ పర్యటనకు అనుమతి లేదని వారు పేర్కొన్నారు. అందుకే రాహుల్​ను అనుమతించం."

-డీకే ఠాకూర్​, లఖ్​నవూ పోలీస్ కమిషనర్​

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur violence news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi Latest News) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.