ETV Bharat / bharat

249 కిలోల బైక్​ను మోస్తూ 100 మీటర్ల రన్నింగ్​.. వరల్డ్ రికార్డు సాధించిన హెడ్ మ్యాన్.. ​ - త్రిపుర బైక్​ మోస్తూ పరుగు పందెం

249 కిలోల బైక్​ను భుజంపై పెట్టుకుని పరిగెత్తాడు బిహార్​కు చెందిన ఓ వ్యక్తి. కేవలం 30 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనెవరో ఓ సారి తెలుసుకుందాం.

dharmendra ran with a bike on shoulder
హెడ్​ మ్యాన్​ ధర్మేంద్ర కుమార్ కొత్త రికార్డ్​
author img

By

Published : Jan 3, 2023, 9:25 PM IST

Updated : Jan 3, 2023, 9:32 PM IST

249 కిలోల బైక్​ మోస్తూ 100 మీటర్లు.. వరల్డ్ రికార్డ్ సాధించిన హెడ్ మ్యాన్.. ​

స్టంట్స్​ రారాజు, హెడ్​ మ్యాన్​గా పేరొందిన బిహార్​కు చెందిన ధర్మేంద్ర కుమార్​ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. 249 కిలోల బైక్​ను భుజంపై మోస్తూ కేవలం 30 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తాడు. దీంతో ధర్మేంద్ర ఈ పరుగు పందెంలో విజేతగా నిలిచాడు.

అసలేం జరిగిందంటే..
2022 డిసెంబర్​ 31న త్రిపుర రాజధాని అగర్తలాలో బైక్​ను మోస్తూ పరుగెత్తెె పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 21 దేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. ధర్మేంద్ర 115.45 సీసీ సామర్థ్యం ఉన్న బైక్​ను భుజాన వేసుకొని పరుగెత్తాడు. ఈ పరుగు పందెంలో ధర్మేంద్ర గెలుపొందాడు. దీంతో వరల్డ్​ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్​ను సొంతం చేసుకున్నాడు.

dharmendra ran with a bike on shoulder
హెడ్​ మ్యాన్​ ధర్మేంద్ర కుమార్

"బైక్‌ను ఎత్తుకుని 100 మీటర్లు పరిగెత్తడం సరదాగా అనిపించింది.. ఇప్పుడు నేను సృష్టించిన రికార్డును బద్దలు కొట్టాలని ప్రపంచం మొత్తానికి ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విషయం గర్వంతో చెప్పడం లేదు. ఇది నా విశ్వాసం, నా పోరాటం. ఈ రికార్డు యువతరానికి నా బహుమతి. అలాగే.. ఈ రికార్డు ద్వారా, యావత్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా".
--ధర్మేంద్ర కుమార్, హెడ్​ మ్యాన్​​

Last Updated : Jan 3, 2023, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.