DGCA New Covid Norms: మాస్క్ ధరించని విమాన ప్రయాణీకులను బోర్డింగ్ అయ్యే ముందే నిలుపుదల చేయాలని డీజీసీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన సూచనలకు బదులుగా.. తాజాగా విడుదల చేసిన నిబంధనలు అమలు చేయాలని సర్కులర్ విడుదల చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు విమానయాన సిబ్బంది నుంచి ఫిర్యాదులు అందడం వల్ల డీజీసీఏ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
మాస్క్ లేకుండా విమానాశ్రయంలోకి ప్రయాణికులను అనుమతించవద్దని సీఐఎస్‌ఎఫ్‌కు మార్గదర్శకాలు పంపింది. ఒకవేళ లోపలికి వచ్చినా.. బోర్డింగ్ అవ్వకుండా వెనక్కి పంపాలని సూచించింది. ప్రయాణ సమయంలోనూ తప్పకుండా మాస్కు ధరించాలని నిర్దేశించింది. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ తాజా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 'విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?.. ఏం సాధించారు?'