ETV Bharat / bharat

ఫడణవీస్​పై మాలిక్​ 'హైడ్రోజన్​ బాంబ్​'- దావూద్​కు ముడిపెడుతూ...

ముంబయి క్రూయిజ్​ నౌక డ్రగ్స్ కేసు(cruise ship drugs case)​ రాజేసిన చిచ్చు.. ఇప్పుడు రాజకీయ దావానలంగా మారింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్(Nawab Malik on Fadnavis)​, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అండర్​ వరల్డ్​తో సంబంధాలు ఉన్నాయంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Nawab Malik
మాలిక్​, ఫడణవీస్​ మధ్య మాటల యుద్ధం
author img

By

Published : Nov 10, 2021, 12:56 PM IST

Updated : Nov 10, 2021, 1:48 PM IST

క్రూయిజ్​ నౌక డ్రగ్స్​ కేసు(cruise ship drugs case) మహారాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్​ ఖాన్​ అరెస్టయిన దగ్గరి నుంచి ఆ రాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ను(Nawab Malik on Fadnavis) ఇందులోకి లాగారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. డ్రగ్స్​ సరఫరాదారుతో ఫడణవీస్​ దిగిన ఫొటోను ట్వీట్​ చేయగా.. దానిని తిప్పికొడుతూ.. అండర్​వల్డ్​తో మాలిక్​కు సంబంధాలు ఉన్నాయని మాజీ సీఎం ఆరోపించారు. తాజాగా మరోమారు ఫడణవీస్​పై తీవ్ర ఆరోపణలు చేశారు నవాబ్​ మాలిక్​.

ముంబయిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ(Nawab Malik on Fadnavis).. ఎన్​సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడేను కాపాడేందుకు ఫడణవీస్​ ప్రయత్నిస్తున్నారని, నేర రాజకీయాలకు ఆయనదే బాధ్యతని ఆరోపించారు.

" తప్పుడు కేసుల్లో అమాయకులను ఇరికిస్తోన్న వ్యక్తితో నేను పోరాడుతున్నా. నేను లేవనెత్తిన అంశాన్ని దేవేంద్ర ఫడణవీస్ పక్కదోవ పట్టించటమే కాక ఒక అధికారిని(సమీర్​ వాంఖడే) రక్షించాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన పదవీకాలంలో రియాజ్​ భటి, మున్నా యాదవ్​ వంటి క్రిమినల్స్​, గూండాలను తయారు చేశారు. నాగ్​పుర్​కు చెందిన మున్నా యాదవ్​ను నిర్మాణ రంగ కార్మికుల బోర్డుకు ఛైర్మన్​గా ఫడణవీస్​ నియమించారు. బంగ్లాదేశీయులను అక్రమంగా దేశంలోకి చేరేవేసిన హైదర్​ అజామ్​ను మౌలానా ఆజాద్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​కు ఛైర్మన్​ను చేశారు. దావూద్​ ఇబ్రహీం సన్నిహితుడు రియాజ్​ భటి.. నకిలీ పాస్​పోర్టుతో ముంబయి విమానాశ్రయంలో అరెస్ట్​ అయ్యాడు. రియాజ్​ భటి ఎవరు అనేది ఫడణవీస్​ చెప్పాలి? అతనికి అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. భటి మీతో, భాజపా కార్యక్రమాల్లో ఎందుకు ఉన్నాడు? ప్రధాని మోదీ హాజరైన కార్యక్రమాల్లోనూ కనిపించాడు. అలాంటి వ్యక్తి ప్రధాని కార్యక్రమం వరకు ఎలా చేరుకోగలిగాడు?"

- నవాబ్​ మాలిక్​, మహారాష్ట్ర మంత్రి.

నకిలీ కరెన్సీ రాకెట్​..

అండర్​వరల్డ్​కు చెందిన వారికి దేవేంద్ర ఫడణవీస్​ పాస్​పోర్టులు ఇచ్చారని ఆరోపించారు మాలిక్​(Nawab Malik on Fadnavis). నోట్ల రద్దు సమయంలో దేశవ్యాప్తంగా రూ.2వేలు, రూ.5వందల నకిలీ నోట్ల పట్టివేత కేసులు నమోదైతే.. మహారాష్ట్రలో ఒక్క కేసు కూడా రాలేదని, అందుకు ఫడణవీస్​ నేతృత్వంలోనే నకిలీ కరెన్సీ రాకెట్​ జరగటమే కారణమన్నారు. 2017, అక్టోబర్​ 8న బంద్రా కుర్లా కాంప్లెక్స్​లో డీఆర్​ఐ రైడ్​ చేసి రూ.14.56 కోట్లు స్వాధీనం చేసుకుంటే, కేవలం రూ.8.80 లక్షలు చూపించారన్నారు. ఆ దర్యాప్తులో సమీర్​ వాంఖడే సైతం ఉన్నారని గుర్తు చేశారు. భాజపా హయాంలో.. వాంఖడే, ఫడణవీస్​ మధ్య స్నేహం కారణంగానే ముంబయిలో క్రిమినల్​ చర్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. క్రూయీజ్​ నౌక డ్రగ్స్​ కేసులో(cruise ship drugs case) అరెస్టయిన ఆర్యన్​ ఖాన్​ విడుదలకు రూ.25 కోట్లు డిమాండ్​ చేశారని, ఆ తర్వాత రూ.18 కోట్లకు బేరం కుదుర్చుకున్నారని, అయితే.. ఆ పార్టీకి ఆర్యన్​ ఖాన్​ను ఎందుకు ఆహ్వానించారు? అని ప్రశ్నించారు.

ఫడణవీస్ ట్వీట్​.

నవాబ్​ మాలిక్​ ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా పరోక్షంగా స్పందించారు దేవేంద్ర ఫడణవీస్​. ' పందితో ఎప్పుడూ కుస్తీ పడొద్దు.. దాని వల్ల మీరే మురికిగా మారుతారు, అంతే కాక దానినే ఆ పంది ఇష్టపడుతుంది అనే విషయాన్ని చాలా రోజుల క్రితం తెలుసుకున్నా' అనే వ్యాఖ్యను జోడించారు.

ఇదీ చూడండి: 'ఫడణవీస్​కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెప్తా'

'1993 పేలుళ్ల​ దోషితో నవాబ్​ మాలిక్​కు సంబంధాలున్నాయి'

Last Updated : Nov 10, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.