ETV Bharat / bharat

రూ.8,357కోట్లతో రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Procurement Of Military Platforms: రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు రూ. 8,357 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ డీసీఏ సమావేశంలో ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

procurement of military platforms
రక్షణ ఉత్పత్తుల కొనుగోలు
author img

By

Published : Mar 23, 2022, 7:55 AM IST

Procurement Of Military Platforms: త్రివిధ దళాలను మరింత ఆధునీకరించడంలో భాగంగా రూ. 8వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ ఫైర్‌ కంట్రోల్‌ రాడార్‌, జీశాట్‌-7బీ శాటిలైట్ సహా రూ. 8,357 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ డీసీఏ సమావేశంలో ఆమోదం లభించింది.

వీటి ద్వారా త్రివిద దళాల్లో మెరుగైన సమాచార వ్యవస్థతో పాటు శత్రు విమానాలను త్వరితగతిన గుర్తింపు వంటి సామర్థ్యం పెరుగుతుందని రక్షణశాఖ వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రేరణగా ఈ ఉత్పత్తులన్నీ దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనలను భారత్‌లో రూపకల్పన, అభివృద్ధి, తయారీ ఐడీఏఎం విభాగం కింద కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

దీని ద్వారా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులను పెంచడం కూడా సాధ్యపడుతుందని రక్షణశాఖ పేర్కొంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా 380 కోట్ల విలువైన ఉత్పత్తులను స్టారప్‌లు, ఎంఎస్​ఎంఈల నుంచి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:

మరికొందరు జి-23 నేతలతో సోనియా భేటీ.. త్వరలోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.