ETV Bharat / bharat

సిలిండర్​ పేలి ఒకే కుటుంబంలోని ఆరుగురు.. హీటర్​ షార్ట్​​ సర్క్యూట్​ వల్ల మరో ముగ్గురు సజీవదహనం - హమీర్​పుర్​లో రూమ్​ హీటర్​ పేలుడు

సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. హరియాణాలో జరిగిందీ ఘటన. మరోవైపు, హీటర్​ షార్ట్​ సర్య్కూట్ అయి ముగ్గురు మరణించారు. ఈ ఘటన హిమాచల్​ప్రదేశ్​లో జరిగింది.

cylinder blast in panipat
cylinder blast in panipat
author img

By

Published : Jan 12, 2023, 9:15 AM IST

Updated : Jan 12, 2023, 10:19 AM IST

హరియాణాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించడం వల్ల పక్క ఇళ్లు కూడా దగ్దమయ్యాయి. ఈ ఘటన పానీపత్​ జిల్లాలో జరిగింది. మృతులను అబ్దుల్​ కరీమ్​(50), అఫ్రోజా(46), ఇష్రత్ ఖటుమ్(17), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్​(7)గా పోలీసులు గుర్తించారు. కాగా, వీరంతా బంగాల్​కు చెందిన ఉత్తర దినాజ్​పుర్​ వాసులని పోలీసులు తెలిపారు. అయితే ఉదయం వంట వండుతున్నప్పుటు గ్యాస్​ లీకై ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.

ఇలాంటి ఘటనే సోమవారం హరియాణాలోని రేవారి జల్లాలో జరిగింది. గ్యాస్​ సిలిండర్​ పేలి దాదాపు 20 గుడిసెలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కార్నవాస్​ అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. కాగా, ఈ అగ్నిప్రమాదంలో పెళ్లి సామగ్రి మొత్తం కాలిపోయింది.

హీటర్​ షార్ట్​ ​సర్క్యూట్​.. ఇద్దరు సజీవ దహనం..
హీటర్​ షార్ట్​ సర్య్కూట్​ కావడం వల్ల తల్లి సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫైర్​ ఇంజిన్​, స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన హిమాచల్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాజు పాల్, అతడి భార్య అనిత (28) కురారా పోలీస్​​స్టేషన్​ పరిధిలోని జల్లా అనే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు మోహిని(6), రోహిని(3) ఉన్నారు. వీరంతా నిద్రిస్తున్న సమయంలో రూమ్​ హీటర్​ షార్ట్​​ సర్క్యూట్​ అయింది. దీంతో మంటలు వ్యాపించి అనితతో పాటు ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిందని సమాచారం. సమచారం అందుకున్న వెంటనే ఫైర్​ ఇంజిన్​ ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హమీర్​పుర్ ఎస్పీ, డీఎమ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Jan 12, 2023, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.