ETV Bharat / bharat

16న సీడబ్ల్యూసీ​ కీలక భేటీ.. ఆ విషయాలపైనే చర్చ! - సీడబ్ల్యూసీ

కాంగ్రెస్​లో కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశం(congress cwc meeting) ఈ నెల 16న జరగనుంది. పార్టీలో గతకొంతకాలంగా జరుగుతున్న పరిణామాల మధ్య సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించాలన్న డిమాండ్​ పెరిగింది. ఈ నేపథ్యంలో దిల్లీలో 16న భేటీ జరనుండగా.. వివిధ అంశాలపై అగ్రనేతలు చర్చించనున్నారు(congress news today).

cwc meeting
సీడబ్య్లూసీ మీటింగ్​
author img

By

Published : Oct 9, 2021, 3:13 PM IST

ఈ నెల 16న దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది(congress cwc meeting). దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలపై(congress president election) అగ్రనేతలు సమాలోచనలు చేయనున్నారు(congress news today). ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

"సీడబ్ల్యూసీ సమావేశం 2021 అక్టోబర్​ 16న జరగనుంది. దిల్లీలోని అక్బర్​ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో భేటీ నిర్వహిస్తున్నాము. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చలు జరగనున్నాయి."

-- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.

గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించాలన్న డిమాండ్​ పెరిగింది. ఈ వ్యవహారంపై అగ్రనేత గులామ్​ నబీ ఆజాద్​.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు.

ఇదీ చూడండి:- రాహుల్‌ పునరాగమనానికి బాటలు పడినట్లేనా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.