ETV Bharat / bharat

సీఆర్పీఎఫ్ బలగాల అధీనంలోకి సాగర్ డ్యామ్ - వెనుదిరిగిన తెలంగాణ పోలీసులు - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం

CRPF Forces Takes Control Over Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్‌ పైకి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి. మధ్యాహ్నం కల్లా సాగర్ ప్రాజెక్టును పూర్తిగా.. కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకోనుంది.

Nagarjuna Sagar water dispute
Nagarjuna Sagar project under control CRFF forces
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:14 AM IST

CRPF Forces Takes Control Over Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project ) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అంగీకారం తెలిపాయి. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్‌ డ్యామ్‌ పైకి చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 5:00 గంటల నుంచి ఒక్కో పాయింట్‌ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి. దీంతో మధ్యాహ్నం కల్లా డ్యామ్‌ పూర్తిగా కేంద్రం వారి అధీనంలోకి వెళ్లనుంది.

Nagarjuna Sagar Water Dispute Updates : ఆ తర్వాత 13వ గేట్ వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. సీఆర్ఫీఎఫ్‌ బలగాల రాకతో.. తెలంగాణ పోలీసులు డ్యామ్‌ వద్ద నుంచి వెనుదిరిగారు. మరోవైపు సాగర్ డ్యామ్‌ నుంచి కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.

సాగర్ వార్ - ఇరు రాష్ట్రాల ఖాకీల పహారాతో టెన్షన్ టెన్షన్ - ఏపీ పోలీసులపై కేసు నమోదు

నాగార్జునసాగర్‌ నుంచి ఏపీ నీటి విడుదల, ఆ రాష్ట్ర పోలీసు బలగాల మోహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆన్‌లైన్‌ ద్వారా అత్యవసర సమీక్ష జరిపారు. గత నెల 29న ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో తలెత్తిన వివాదంపై భల్లా సమీక్ష నిర్వహించారు.

KRMB on Nagarjuna Sagar Water Dispute : గత నెల 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని అజయ్‌కుమార్ భల్లా.. ఆంధ్రప్రదేశ్‌ను కోరారు. ప్రాజెక్టు నిర్వహణ తాత్కాలికంగా సీఆర్పీఎఫ్‌ పర్యవేక్షణలో ఉంటుందని సూచించారు. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని అజయ్‌కుమార్ భల్లా వివరించారు. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేరుకున్నాయి.

'నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం'

కృష్ణా జలాల వివాదంపై నేడు సమావేశం : కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌లు, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లకు లేఖ పంపింది. శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలు, వాటి పరిధిలో ఉన్న ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు (KRMB) బదిలీ చేసే అంశాలపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు వివరించింది.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

'నాగార్జునసాగర్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.