ETV Bharat / bharat

Covid Cases In India : 236 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసులు.. ముప్పు తప్పదా? - భారత్​ కరోనా కేసులు

covid cases in india: భారత్​లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటలవరకు 11,109 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్​తో 29 మంది మరణించారని పేర్కొంది.

covid cases today
ఈ రోజు కోవిడ్​ కేసులు
author img

By

Published : Apr 14, 2023, 11:06 AM IST

Updated : Apr 14, 2023, 10:32 PM IST

covid cases in india: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 236 రోజుల తరువాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటలవరకు 11,109 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహమ్మారితో 29 మంది మరణించినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 49,622 కొవిడ్​ యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

  • దేశంలో కొత్తగా 11,109 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • గురువారం కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,31,064కు చేరింది.
  • దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరింది.
  • రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.29 శాతంగా ఉంది.
  • ఇప్పటివరకు దేశంలో 4,47,97,269 మందికి కొవిడ్ సోకింది.
  • కొవిడ్ నుంచి ఇప్పటివరకు 4,42,16,586 మంది కోలుకున్నారు.
  • ఇప్పటివరకు 220.6 కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు.

కొవిడ్​పై కేంద్రం ఊరటనిచ్చే సంకేతాలు..
దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసులు కొన్ని రోజులుగా పెరుగుతున్న వేళ.. రెండు రోజుల క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు ఊరటనిచ్చే వార్త చెప్పాయి. భారత్‌లో కొవిడ్ ఎండమిక్‌ దశకు చేరిందని అంచనా వేశాయి. కేసులు మరో 10 నుంచి 12 రోజులు పాటు పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోతాయని చెప్పాయి. రోజువారీ కేసులు ఎక్కువగా నమోదువుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య బాగా తక్కువగా ఉందని వెల్లడించాయి. కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్‌ ఉపవేరియంట్ XBB.1.16 రకమే కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగిలిన వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపడంలేదని వివరించాయి. XBB.1.16 రకం కేసులు ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా.. మార్చి నాటికి 35.8శాతానికి చేరాయి. దీని వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య పెరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం..
కొద్ది రోజుల క్రితం.. దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌లలో కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య, కొవిడ్‌ మరణాలు తక్కువే ఉన్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని చెప్పింది కేంద్రం. పరిస్థితులను అన్ని రాష్ట్రాలు క్షుణ్నంగా పరిశీలించి.. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించింది. జనం గుంపులుగా ఉండే పరిస్థితులను నియంత్రించాలని.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు తప్పక మాస్క్ ధరించాలని హితవు పలికింది. కొవిడ్‌ పరీక్షలు పెంచి, లక్షణాలపై తప్పకుండా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం ఇక్కడి క్లిక్​ చేయండి

Last Updated : Apr 14, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.