ETV Bharat / bharat

దేశంలో మరో 2వేల కరోనా కేసులు- భారత్​పై​ సౌదీ ప్రయాణ ఆంక్షలు - ఈరోజు కరోనా కేసులు

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,022 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

INDIA COVID CASES
INDIA COVID CASES
author img

By

Published : May 23, 2022, 9:36 AM IST

Updated : May 23, 2022, 12:49 PM IST

INDIA COVID CASES: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా ఆదివారం 2,022 కేసులు నమోదయ్యాయి. మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,099 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు:43,107,573
  • మొత్తం మరణాలు: 5,24,459
  • యాక్టివ్​ కేసులు: 14,832
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,99,102

Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 8,81,668 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,38,45,615కు చేరింది. ఒక్కరోజే 2,94,812 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 4,76,103 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 476 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,74,79,191కు చేరింది. మరణాల సంఖ్య 63,00,257కు చేరింది. ఒక్కరోజే 6,42,980 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,74,80,466గా ఉంది.

  • ఆస్ట్రేలియాలో తాజాగా 38,514 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో తాజాగా 34,957 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో కొత్తగా 19,979 కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో 19,298 కేసులు వెలుగుచూశాయి. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 17,744 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొరియాలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా మరో 1,67,650మంది కరోనా బారినపడగా.. ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కు చేరుకుంది. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 28,14,380 మందికి కరొనా సోకగా..23,34,910మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఓ ఉన్నతాధికారి అంత్యక్రియలను బహిరంగంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ సహా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

భారత ప్రయాణికులపై ఆంక్షలు: కరోనా కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా పదహారు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. లెబనాన్​, సిరియా, టర్కీ, ఇరాన్​, అఫ్గానిస్థాన్​, ఎమెన్​, సోమాలియా, ఇథియోపియా, ఇండోనేషియాతో పాటు మరో ఆరు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. మరోవైపు మంకీపాక్స్​ వైరస్​ కలవర పెడుతున్న సమయంలో.. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని సౌదీ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతానికి మంకీ పాక్స్ కేసు నమోదు కాలేదని పేర్కొంది.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

Last Updated : May 23, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.