ETV Bharat / bharat

రూ.100 కోసం ఘర్షణ- వ్యక్తి హత్య

author img

By

Published : May 17, 2021, 6:18 AM IST

దిల్లీలో దారుణ ఘటన జరిగింది. రూ.100 కోసం.. 40 ఏళ్ల వ్యక్తిని అతిదారుణంగా పొడిచి చంపారు దంపతులు. ఈ ఘటనలోని నిందితుల్లో.. భార్యను అరెస్ట్​ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

Murder, Dead body
హత్య, మరణం

దిల్లీ మహానగరంలో దారుణానికి పాల్పడ్డారు భార్యభర్తలు. వంద రూపాయల కోసం ఓ 40ఏళ్ల వ్యక్తితో దంపతులు గొడవకు దిగారు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు.

ఏమైందంటే?

దిల్లీలోని మంగోల్​పురికి చెందిన నిందితుడు జితేందర్​.. అజిత్​(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అజిత్​..ఆగ్రహంతో జితేందర్​ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్​ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. అతడితోపాటు భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్​పై దాడి చేసి.. కత్తితో పొడిచి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్​ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్​ భార్య రేష్మను అరెస్ట్​ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న జితేందర్​ కోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వెయ్యికిపైగా అంత్యక్రియలు చేసిన సూపర్ 'పోలీస్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.