ETV Bharat / bharat

మూఢ నమ్మకంతో ఆత్మహత్యలు.. ప్రత్యేక యంత్రంతో తలలు నరుక్కుని, హోమగుండంలో పడేలా చేసి.. - తాంత్రిక పూజలు చేసి తలలు నరుక్కున్న దంపతులు

గుజరాత్​లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢ నమ్మకాలతో ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. గెలిటిన్​ మిషన్​ లాంటి పరికరంతో తలలు నరుక్కున్నారు. హోమం ఏర్పాటు చేసి.. తాంత్రిక పూజలు నిర్వహించి.. ప్రాణాలు బలిచ్చారు.

couple-performed-tantric-puja-and-beheaded-in-gujarat
తాంత్రిక పూజలు చేసి తలలు నరుక్కున్న దంపతులు
author img

By

Published : Apr 17, 2023, 1:55 PM IST

తలలు నరుక్కుని ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూఢ నమ్మకాలతో తాంత్రిక పూజలు చేసి.. ప్రాణాలు బలిచ్చారు. శిరచ్ఛేదక యంత్రం​ లాంటి పరికరంతో తలలు తెగ్గేసుకున్నారు. బలి కోసం ఓ గుడిసెను నిర్మించి.. అందులో అగ్ని హోమాన్ని ఏర్పాటు చేసి.. తలలు అందులో పడే విధంగా నరుక్కున్నారు. గుజరాత్​లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్​కోట్​ జిల్లాలోని వించియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను హేంభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్​ కూడా లభించింది. వీరు తమ వ్యవసాయం పొలంలోనే ఓ గుడిసెను నిర్మించి.. అందులోనే తాంత్రిక పూజాలు చేశారు. అనంతరం ప్రాణాలను బలిచ్చారు. ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్​మార్టం పరీక్షల నిమిత్తం వాటిని ఆసుపత్రికి తరలించారు.

" వీరిద్దరూ తమ ప్రాణాలను బలివ్వాలని ముందే అనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గెలిటిన్​ మిషన్​ (తల నరికి మరణ శిక్ష అమలు చేసేందుకు ఉపయోగించే యంత్రం) లాంటి పరికరాన్ని తయారు చేసుకున్నారు. తలలు తెగాక.. అవి నేరుగా అగ్ని హోమంలో పడే విధంగా ఏర్పాటు చేశారు. గెలిటిన్​ మిషన్​ను తాడుతో కట్టి.. అందులో వీరి తలల ఉంచి, అనంతరం తాడు విడిచి పెట్టారు. దీంతో వారి తలలు తెగి అగ్ని హోమంలో పడ్డాయి." అని పోలీసులు తెలిపారు.

ఈ దంపతులిద్దరూ శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తాంత్రిక పూజలు చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం తమకు తాము ప్రాణాలు బలి ఇచ్చుకుని ఉంటారని చెప్పారు. ఒక సంవత్సర కాలం నుంచి హేంభాయ్ మక్వానా, హన్సాబెన్​.. రోజూ తాంత్రిక పూజలు చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారని వారు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వెల్లడించారు. తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా మారిన పిల్లలను సంరక్షించాలని బంధువులకు పోలీసులు సూచించారు.

మృతుడి డబ్బుపై ఆశతో నరబలి.. పిల్లాడిని కిడ్నాప్ చేసి, తల నరికి..
కొద్ది రోజుల క్రితం దాద్రానగర్ హవేలిలోని సిల్వాస్సాలో దారుణ హత్య జరిగింది. నరబలి చేస్తే డబ్బులు వస్తాయన్న మూఢనమ్మకంతో.. లోకజ్ఞానం తెలియని చిన్న పిల్లాడిని చంపేశారు కొందరు దుండగులు. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా తల నరికేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుడిని అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.