దేశంలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 45,903 మందికి కరోనా సోకింది. మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కొత్తగా బయటపడిన కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా 48,405 మంది వైరస్ను జయించారు. దీంతో రికవరీ రేటు 92.56 శాతానికి చేరింది. మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది.
కరోనా కట్టిడిలో భాగంగా కొవిడ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మొత్తం టెస్టుల సంఖ్య 11 కోట్ల 85 లక్షల 72 వేలకు చేరింది.
ఇదీ చూడండి: ఉల్లి రైతుల నష్టాలకు చెక్ పెట్టే పరికరం!