Corona Cases in India : దేశంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 7,591 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.19 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,08,132
- క్రియాశీల కేసులు: 84,931
- మొత్తం మరణాలు: 5,27,799
- కోలుకున్నవారు: 4,38,02,993
Vaccination In India : దేశంలో ఆదివారం 24,70,330 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,11,91,05,738కు చేరింది. ఒక్కరోజే 1,65,751 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరింత తగ్గాయి. కొత్తగా 4,56,630 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 890 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 605,808,634 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,488,018 మంది మరణించారు. శనివారం మరో 6,64,326 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 581,048,786 కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,72,865 కేసులు వెలుగుచూశాయి. మరో 248 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో 85,295 కొవిడ్ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో 8,451 కొత్త కేసులు, 8 మరణాలు వెలుగుచూశాయి.
- ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: రాంచీలో స్వైన్ ఫ్లూ కలకలం, ఆఫ్రికన్ ఫీవర్‌కు 3 వేల పందులు బలి
చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్ లేక కాలినడకన