Corona Cases in India : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 7,231 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 45 మంది మరణించారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,08,132
- క్రియాశీల కేసులు: 64,667
- మొత్తం మరణాలు: 5,27,874
- కోలుకున్నవారు: 4,38,35,852
Vaccination In India : దేశంలో మంగళవారం 22,50,854 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,12,39,92,816కు చేరింది. ఒక్కరోజే 3,52,166 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 543,810 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 1,559 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 607,049,587కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 6,491,720మంది మరణించారు. శనివారం మరో 6,64,326 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 582,970,193కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,25,907 కేసులు వెలుగుచూశాయి. మరో 248 మందికిపైగా మరణించారు.
- దక్షిణ కొరియాలో 1,15,519 కొవిడ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో 49,906 కొత్త కేసులు, 251 మరణాలు వెలుగుచూశాయి.
- రష్యా, ఇటలీ, జర్మనీ, తైవాన్, బ్రెజిల్‌లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
ఇవీ చదవండి: 'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'
అంధత్వం అడ్డురాలేదు.. పట్టుదలతో సాధించాడు.. లక్షల్లో జీతంతో మైక్రోసాఫ్ట్‌లో కొలువు