Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు ఒక్కరోజే 13,313 మంది వైరస్ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 10,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81 గా నమోదైంది.
- మొత్తం కరోనా కేసులు: 4,33,44,958
- మొత్తం మరణాలు: 5,24,941
- యాక్టివ్ కేసులు: 83,990
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,36,027
Vaccination India: భారత్‌లో బుధవారం 14,91,941 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గగా.. మరణాలు పెరిగాయి. ఒక్కరోజే 7,24,039 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,519 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 546,564,997కు చేరింది. మరణాల సంఖ్య 6,345,548కు చేరింది. ఒక్కరోజే 527,556 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,143,299గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 119,762 కొత్త కేసులు బయటపడగా.. 105 మంది మరణించారు.
- అమెరికాలో 93,837 కేసులు వెలుగుచూశాయి. 390 మందికిపైగా చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో 77,967 కొత్త కేసులు నమోదుకాగా.. 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 70,285 కరోనా కేసులు నమోదు కాగా.. 176 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 53,905మంది కొవిడ్ బారినపడగా..50 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 12 వేలకుపైగా కేసులు